Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్

Published on Fri, 09/12/2025 - 15:02

ఓటీటీలోకి మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో బిగ్‌బాస్ 8 తెలుగు ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్రలో నటించింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.

సంతోష్‌ కల్వచెర్ల, క్రిషికా పటేల్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ 'కిల్లర్‌ ఆర్టిస్ట్‌'. సోనియా ఆకుల కీలకపాత్రలో నటించింది. రతన్‌ రిషి దర్శకుడు. మార్చి 21న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, మూవీ కూడా అంతంత మాత్రంగానే ఉండేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం దీనితోపాటు పరదా, కూలీ, సయారా, సు ఫ్రమ్ సో లాంటి సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ 'పరదా' సినిమా)

'కిల్లర్ ఆర్టిస్ట్' విషయానికొస్తే.. విక్కీ (సంతోష్), స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలు. ఇంట్లో ఉన్నప్పుడు గుర్తుతెలియని కొందరు వీరిపై దాడి చేస్తారు. స్వాతిని చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. జాను (క్రిషేక్ పటేల్) ఇతడి జీవితంలోకి వస్తుంది. మామూలు మనిషిగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు ఓ హీరోయిన్‌ మాస్క్‌ ధరించి 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్‌ చేస్తూ చంపేస్తుంటాడు.

ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్‌ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్‌ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే అయ్యుంటాడని విక్కీ అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకుంటాడు. విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతడు ప్రత్యక్షమవుతాడు. అయితే తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీకి తెలుస్తుంది. అసలు స్వాతిని చంపింది ఎవరు? సిటీలోని హత్యలు చేస్తున్నది ఒకరా? లేదా ఇద్దరా? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‍'కిష్కింధపురి' సినిమా రివ్యూ)

Videos

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Garam Garam Varthalu: ‪120 ఏళ్లు.. హ్యాపీ బర్త్‌ డే బామ్మ

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)