ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్

Published on Wed, 04/23/2025 - 16:19

పలు కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అర్చన కొట్టిగె(Archana Kottige) పెళ్లి చేసుకుంది. తన రాష్ట్రానికి చెందిన శరత్ అనే క్రికెటర్ తో కొత్త జీవితం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇ‍ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2018 నుంచి ఇండస్ట్రీలో ఉన్న అర్చన.. డియర్ సత్య, యెల్లో గ్యాంగ్స్, విజయానంద్, హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే తదితర సినిమాల్లో నటించింది. ఈమె వయసు ప్రస్తుతం 28 ఏ‍ళ్లే.  అయితేనేం కర్ణాటక తరఫున క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న శరత్ బీఆర్(Sharath Br)ని పెళ్లి చేసుకుంది. బుధవారం ఉదయం సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి(Heroine Wedding) జరిగింది.

(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

ఇకపోతే మంగళవారం రాత్రి అర్చన-శరత్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగ్గా.. కాంతార హీరోయిన్ సప్తమి గౌడతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలానే శరత్ కోసం కర్ణాటకకు చెందిన‍ ప్రసిద్ధ్ కృష్ణ, యష్ దయాల్, దేవదత్ పడిక్కల్ తదితరులు హాజరయ్యారు.

కర్ణాటక తరఫున అండర్-23 ఆడిన శరత్.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. గతేడాది ఐపీఎల్ లోనూ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. కనీస ధర రూ.20 లక్షలకు ఇతడిని టీమ్ దక్కించుకుంది. కానీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకోవడంతో సినీ, క్రికెట్ సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)