Breaking News

అనుష్క శెట్టి.. నమ్మశక్యం కాని రూమర్

Published on Thu, 04/09/2026 - 01:41

హీరోయిన్ అనుష్క శెట్టి బయట కనిపించి చాలా ఏళ్లు గడిచిపోయింది. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ ఆచితూచి సినిమాలూ చేస్తూ వస్తోంది. అయితే 'సైజ్ జీరో' చేసిన తర్వాత ఈమెకు బరువు సమస్యలు రావడంతో మూవీస్ అయితే చేస్తోంది గానీ ప్రచారానికి మాత్రం నో చెబుతూనే వస్తోంది. గతేడాది 'ఘాటీ' చిత్రం చేసింది. దీని ప్రమోషన్‌లోనైనా కనిపిస్తుందేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. అలాంటిది ఇప్పుడు చిత్రమైన రూమర్ వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్ రాకా.. అసలు ఆ టైటిల్ అర్థమేంటో తెలుసా?)

అనుష్క ఇప్పటివరకు తెలుగు, తమిళంలో మాత్రమే సినిమాలు చేసింది. తొలిసారి మలయాళంలో 'కథనార్' అనే మూవీలో నటించింది. రీసెంట్‌గానే తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో స్వీటీని ఒకటి రెండు షాట్స్‌కే పరిమితం చేయడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ చిత్ర ప్రచారానికి అనుష్క.. ఏకంగా హైదరాబాద్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఆడియెన్స్ మాత్రం నమ్మట్లేదు.

ఎందుకంటే తెలుగులో నేరుగా సినిమాలు చేసినప్పుడే వాటిని ప్రమోట్ చేసేందుకు బయటకు రాలేదు. అలాంటిది ఓ మలయాళ డబ్బింగ్ చిత్రం కోసం హైదరాబాద్ వస్తుందా? సందేహమే అని మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలోనే మూవీ థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. కానీ ఏ నెల అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 9వ శతాబ్దానికి చెందిన కథనార్ అనే క్రైస్తవ మతప్రచారకుడి జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

(ఇదీ చదవండి: చిరైయా రివ్యూ : ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్‌ ఇది!)

Videos

అమరావతిలో అసైన్డ్ భూ దోపిడీ.. బాబు అండ్ కో బిగ్ స్కామ్!

హార్ముజ్ మళ్లీ మూసివేత.. ఇరాన్ సంచలన నిర్ణయం

జనసేన రాసలీలలు.. నన్ను శారీరకంగా వాడుకొని మోసం చేశాడు..

పచ్చ కుట్రలకు కూలిన జనసేన నేత ఇల్లు.. పట్టించుకోని పవన్..

మూడు రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం

'మావిగన్' దెబ్బకు మైండ్ బ్లాంక్..

బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు

లులు మాల్ విషయంలో తప్పు చేశాం భయపడి వెనక్కి తగ్గిన ప్రభుత్వం

బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...

భారతీయులు ఇరాన్ వదిలి వెళ్లిపోండి

Photos

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)