Breaking News

స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించా.. కానీ చివరకు

Published on Mon, 01/26/2026 - 18:39

డైరెక్టర్ అనుదీప్ అనగానే అందరికీ 'జాతిరత్నాలు' సినిమానే గుర్తొస్తుంది. అంతకు ముందు ఓ మూవీ చేసినప్పటి.. దీని తర్వాతే బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ, బయట.. ఎక్కడైనా సరే తనదైన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు 'ఫంకీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 13న రిలీజ్. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

ఎవరినైనా ప్రేమించారా? అని యాంకర్ సుమ, అనుదీప్‌ని అడగ్గా..'స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అంటే వన్ సైడ్ లవ్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవరినీ లవ్ చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రేమ, పెళ్లి మీద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు' అని క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే అనుదీప్.. ఇదంతా సీరియస్‌గానే చెప్పాడా? లేదా జోక్‌గా చెప్పాడా? అనేది తెలియదు. ఎందుకంటే చాలా కామెడీ విషయాన్ని కూడా సీరియస్ ఫేస్ పెట్టి చెబుతుంటాడు. కొన్నిసార్లు అయితే నిజాన్ని, అబద్ధాన్ని ఒకేలా చెబుతుంటాడు. ఇప్పుడు చెప్పింది కూడా ఆ రెండింటిలో ఏదా అనేది తెలియదు. మూవీ విషయానికొస్తే 'జాతిరత్నాలు' తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' తీశాడు. కానీ సరిగా ఆడలేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'ఫంకీ'తో వస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?

(ఇదీ చదవండి: మేం రొమాన్స్ చేస్తుంటే.. అనుదీప్ బిగుసుకుపోయేవాడు)

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)