Breaking News

ఐ బొమ్మ రవి కేసులో బిగ్‌ ట్విస్ట్.. వచ్చింది విడాకుల కోసం కాదు!

Published on Mon, 11/17/2025 - 17:45

ఐ బొమ్మ రవి అరెస్ట్‌ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటికొస్తున్నాయి. విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న రవిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది కాస్తా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రవి అరెస్ట్‌తో సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే తన భార్యతో విడాకుల కేసు కోసమే ఇండియాకు వస్తుండగా రవి అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చాయి. అందరూ అదే నిజమనుకున్నారు.

కానీ తీరా చూస్తే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు రవి విడాకుల కోసం ఇండియాకు రాలేదని తెలుస్తోంది.  హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని టాక్. అంతేకాకుండా అతను 2022లోనే ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. భారత పౌరసత్వాన్ని వదులుకొని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్‌ సిటిజన్‌షిప్‌ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  కాగా.. 2022 నుంచి కరేబియన్‌ దీవుల్లోనే నివాముంటున్నారు. 

అయితే టెక్నాలజీని వాడుకోవడంలో కింగ్ అయిన ఇమ్మడి రవి.. పైరసీ సైట్‌ ఐ బొమ్మను స్థాపించాడు. దాదాపు కొన్ని వేల సినిమాలను ఐ బొమ్మ ద్వారా అందుబాటులో ఉంచాడు. ఓటీటీ కంటెంట్‌ను డీఆర్‌ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్‌లోడ్‌ చేసినట్లు తెలుస్తోంది.  మూవీరూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్‌డీ ఫార్మాట్‌లోకి మార్చి ఐబొమ్మ సైట్‌లో అప్‌లోడ్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)