Breaking News

ఓటీటీలోకి తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా

Published on Sun, 11/01/2026 - 12:53

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ అలా లెక్కలేనన్ని వచ్చాయి. వాటిలో కామ్రేడ్ కళ్యాణ్, బత్తా, సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అదే నీవు అదే నేను, మీర్జాపుర్, ఎస్సై యుగంధర్, ఇమ్మోర్టల్ చిత్రాలతో పాటు అక్క, రుద్రవనం పీఎస్ సిరీస్‌లు ఉన్నాయి. ఇవలా ఉంచితే ఓ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధమైంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)

ప్రముఖ దర్శకుడు త్రినాథ్ నక్కిన.. నిర్మాతగా మారి నటుడిగా చేసిన సినిమా 'అనకాపల్లి'. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట హీరోహీరోయిన్లుగా నటించారు. గత నెల 02న థియేటర్లలోకి వచ్చింది. కానీ కంటెంట్ తీసికట్టుగా ఉండటం, స్టార్స్ లేకపోవడంతో జనాలు దీనిని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఈ మంగళవారం(నవంబర్ 03) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

'అనకాపల్లి' విషయానికొస్తే.. అనకాపల్లి ప్రాంతంలో బుల్లెట్‌ (తారక్ పొన్నప్ప) అనే రౌడీ పేరంటేనే భయపడే పరిస్థితి. డ్రగ్స్ బిజినెస్ చేసే‌ నాయుడు(కాండ్రేగుల నాయుడు)తో బుల్లెట్‌కు తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇదే ఊరిలో నిజాయితీగా బతుకుతూ ఏఈగా పనిచేసే సాంబశివరావు (త్రినాథరావు నక్కిన) కొడుకు సూర్య (విక్రమ్ సహిదేవ్).. బుల్లెట్‌ని చూసి ఆకర్షితుడై అతడి‌ గ్యాంగ్‌లో చేరతాడు.

ఇద్దరూ కలిసి ఎమ్మెల్యే (వడ్లమాని శ్రీనివాస్) అనుచరుడు నాయుడిని మర్డర్ చేస్తారు. బుల్లెట్టుకు నమ్మకమైన అనుచరుడిగా ఉన్న సూరి ఎదురు తిరుగుతాడు. బుల్లెట్టు ఆధిపత్యాన్ని సవాల్ చేస్తాడు. సూరి అలా ఎందుకు చేశాడు? తొలి చూపులోనే  ఇష్టపడ్డ అమృత (సంధ్య వశిష్ట)తో సూరి ప్రేమాయణం ఎలా సాగింది? బుల్లెట్‌, సూర్య, అమృత, నాయుడు మధ్య సంబంధాలు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'అనకాపల్లి' మూవీ రివ్యూ)

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)