Breaking News

ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా

Published on Wed, 03/04/2026 - 16:08

ఈ వారం ఓటీటీల్లోకి పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఓం శాంతి శాంతి శాంతిః, దేవగుడి, వంచన తదితర చిత్రాలు ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి రాగా.. మరికొన్ని మూవీస్ వీకెండ్‌లో అందుబాటులోకి రానున్నాయి. వాటిలో గాంధీ టాక్స్, కృష్ణ సదా సహాయతే, విత్ లవ్, తన్వి ది గ్రేట్ తదితర సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు థ్రిల్లర్ చేరింది. దాదాపు ఏడాది తర్వాత ఇది స్ట్రీమింగ్‌లోకి వస్తోంది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోహీరోయిన్లు నిర్మాతలు వస్తూనే ఉంటారు. అలా తీసిన ఓ సినిమా 'అనగనగా ఆస్ట్రేలియాలో'. జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తారకరామ దర్శకత్వం వహించారు. పేరుకు తగ్గట్లే పూర్తిగా ఆస్ట్రేలియాలోనే తీసిన ఈ మూవీ గతేడాది మార్చి 21న థియేటర్లలోకి వచ్చింది. అందరూ కొత్త నటీనటులే కావడంతో ఇదొకటి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడీ చిత్రం ఆహా ఓటీటీలోకి శుక్రవారం (మార్చి 06) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

'అనగనగా ఆస్ట్రేలియాలో' విషయానికొస్తే.. హీరో (జ్యోతినాథ్) ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్‌గా చేస్తుంటాడు. హీరోయిన్(సాన్య భట్నాగర్) అక్కడే చదువుకుంటూ ఉంటుంది. మరోవైపు భారత్‌లో ఓ రాజకీయ నేత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నప్పుడు.. ఆస్ట్రేలియా నుంచి ఒకరు ఫోన్ చేసి మీ రహస్యం నా దగ్గరుందని చెప్పి భయపెడతాడు. దీని పని తేల్చాలని సదరు నాయకుడు.. ఓ కిల్లర్‌కి అప్పజెబుతాడు. ఓ రోజు అనుకోకుండా ఆ రహస్యం హీరోయిన్ చేతిలో పడుతుంది. దీంతో కిల్లర్, రాజకీయ నాయకుడు.. ఈ అమ్మాయి వెంట పడతారు. తర్వాత ఏమైంది? మరి హీరోహీరోయిన్ ప్రేమకథ సంగతేంటి? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'ఉ‍స్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్‌కి ముందు భారీ మార్పులు?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)