Breaking News

ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'

Published on Tue, 01/27/2026 - 15:05

ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛాంపియన్, సర్వంమాయ, పతంగ్, అన్నగారు వస్తారు తదితర చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు 'ధురందర్' కూడా ఓటీటీలోకి రానుందనే టాక్ నడుస్తోంది. వీటికి తోడు హాలీవుడ్ క్రేజీ మూవీ 'అనకొండ' ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

(ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)

1997లో తొలిసారి వెండితెరపై 'అనకొండ' సినిమా వచ్చింది. అప్పట్లో ఇలాంటి పాములతో మూవీస్ ఎవరూ తీయలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా జనాలు విరగబడి చూశారు. తెలుగులోనూ డబ్బింగ్ చేస్తే ఇక్కడ కూడా అద్భుతమైన హిట్‌గా నిలిచింది. దీని తర్వాత 2004లో ది హంట్ ఫర్ బ్లడ్ ఆర్కిడ్, 2008లో ఆఫ్ స్ప్రింగ్, 2009లో ట్రయల్ ఆఫ్ బ్లడ్, 2015లో లేక్ ప్లాసిడ్ అని మరో నాలుగు మూవీస్ కూడా వచ్చాయి. కమర్షియల్‌గా హిట్ అయ్యాయి గానీ కంటెంట్ పరంగా ఓకే ఓకే అనిపించుకున్నాయి.

దాదాపు పదేళ్ల విరామం తర్వాత గత నెలలో 'అనకొండ' పేరుతో లేటెస్ట్ మూవీ ఒకటి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇది ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో నెలయ్యేసరికి అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఎల్లుండి (జనరి 29) నుంచి మన దగ్గర కూడా తెలుగు, తమిళ డబ్బింగ్ రూపంలోనూ ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)