Breaking News

మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న 'ఎవడు' సినిమా హీరోయిన్

Published on Mon, 01/29/2024 - 18:55

రామ్ చరణ్ 'ఎవడు' సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమీ జాక్సన్ గుర్తుందా? ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి సిద్ధమైపోయింది. గతంలో కొన్నాళ్ల ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మకు ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత బ్రిటీష్ నటుడితో ప్రేమలో పడింది. గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోయారు.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్)

విదేశాల్లో పుట్టి పెరిగిన అమీ జాక్సన్ తొలుత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత 'మద్రాసు పట్టణం' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంలో ఓ హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత 'అభినేత్రి' అనే ద్విభాషా చిత్రంలోనూ నటించింది. ఈ రెండు తప్పితే తమిళ, హిందీలోనే ఎక్కువగా మూవీస్ చేసింది.

గతంలో జార్జ్ పనయాట్టు అనే వ్యక్తితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమీ జాక్సన్.. అతడితో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. ఏమైందో ఏమో గానీ అతడి నుంచి విడిపోయింది. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు విదేశీ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం నేరుగా చెప్పనప్పటికీ కలిసి బయట కనిపించడంతో అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. తాజాగా స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాల్లో ఇతడు లవ్ ప్రపోజ్ చేశాడు. అమీ జాక్సన్ దీన్ని అంగీకరించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో వీళ్ల పెళ్లి ఉండొచ్చు.

(ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)