ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం
Breaking News
అత్తామామకు సర్ప్రైజ్ ఇచ్చిన నయనిక
Published on Thu, 04/09/2026 - 11:58
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్- నిర్మల దంపతుల ఇంట ఇటీవలే ఓ శుభకార్యం జరిగింది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నయనిక రెడ్డిని ప్రేమించగా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. మార్చి 6న ఎంతో ఘనంగా ఈ వివాహం జరిగింది.
అరవింద్ పెళ్లిరోజు
తాజాగా ఈ కొత్త జంట ఇంట్లోవారికి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఏప్రిల్ 7న అల్లు అరవింద్ - నిర్మల పెళ్లిరోజు. ఈ సందర్భంగా అత్తామామల కోసం చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసింది కొత్త కోడలు నయనిక. వారితో కేక్ కట్ చేయించి ఈ వెడ్డింగ్ యానివర్సరీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

డిన్నర్ పార్టీ
'అమ్మానాన్నల 52వ పెళ్లిరోజు. నేను, నయనిక కలిసి ఇంట్లోనే డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాం' అని తెలిపాడు. ఈ వేడుకలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా భాగమైంది. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టడంతోనే అత్తామామలకు మంచి సర్ప్రైజ్ ఇచ్చిందని నెట్టింట నయనికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి: సాయిపల్లవి మూవీ.. క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్ ఖాన్
Tags : 1