Breaking News

అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా?

Published on Fri, 09/26/2025 - 16:28

అల్లు ఫ్యామిలీలో రాబోయే కొన్ని నెలల్లో పెళ్లి జరగబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బన్నీ సోదరుడు శిరీష్.. ప్రస్తుతం కొత్తగా సినిమాలేం చేయట్లేదు. చివరగా గతేడాది 'బడ్డీ' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తర్వాత నుంచి అటు ఇండస్ట్రీలో గానీ ఇటు సోషల్ మీడియాలో గానీ పెద్దగా యాక్టివ్‌గా లేడు. అలాంటిది ఇప్పుడు ఇతడు త్వరలో వివాహం చేసుకోనున్నాడని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))

హైదరాబాద్‌కి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ కుమార్తెతో శిరీష్‌కి పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారని.. ఇంతలో అల్లు అరవింద్ తల్లి కనకరత్నం చనిపోవడంతో ఇది కాస్త వాయిదా పడిందని వినిపిస్తుంది. వెంటనే కానప్పటికీ రాబోయే కొన్ని నెలల్లో అల్లు ఫ్యామిలీ నుంచి శుభవార్త అయితే రానుందనే టాక్ వినిపిస్తుంది.

మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. తండ్రులు కూడా అయిపోయారు. నిహారిక వివాహం చేసుకుంది కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నారు. వీళ్లలో ఇప్పుడు శిరీష్.. పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: 11 ఏళ్లలో మూడే సినిమాలు.. అసలు ఎవరీ సుజిత్?)

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)