Breaking News

త్వరలో అల్లు శిరీష్ నిశ్చితార్థం.. అధికారిక ప్రకటన

Published on Wed, 10/01/2025 - 15:38

అల్లు వారి ఇంట్లో శుభకార్యం. బన్నీ సోదరుడు, హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ మధ్యనే మూడు నాలుగు రోజుల క్రితం శిరీష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఇన్ స్టాలో ఫొటోలు పోస్ట్ చేశాడు. నయనిక అనే అమ్మాయితో తన ఎంగేజ్‌మెంట్ జరగనుందని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కురుక్షేత్ర'.. ట్రైలర్ రిలీజ్)

'మా తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసుకు సంబంధించిన ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నయనికతో నాకు నిశ్చితార్థం అక్టోబరు 31న జరగనుంది. కొన్నాళ్ల క్రితమే చనిపోయిన మా నానమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకునేది. ఇప్పుడు ఆమె మా మధ్య లేనప్పటికీ పైనుంచి ఆశీర్వదాలు కచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను' అని శిరీష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.

అల్లు అరవింద్ కొడుకుగా అందరికీ తెలిసిన శిరీష్.. 'గౌరవం' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా కొత్త ప్రాజెక్టులు చేయట్లేదు. దీంతో ఏం చేస్తున్నాడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. 

(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)