Breaking News

ఓటీటీలో అల్లు శిరీష్‌ 'బడ్డీ' సినిమా

Published on Sun, 08/25/2024 - 11:40

టాలీవుడ్‌ యాక్టర్‌ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ కామెడీ చిత్రం ' బడ్డీ'. ఆగష్టు 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తమిళ్‌లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటించింది.

బడ్డీ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనుకున్న అల్లు శిరీష్‌కు థియేటర్‌లో నిరాశే మిగిలింది. ఇప్పుడు ఓటీటీలో అయినా మెప్పిస్తాడేమో చూడాల్సి ఉంది. ఆగష్టు 30న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

బడ్డీ కథ ఇదే
ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్‌కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? అనేదే మిగతా కథ.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)