Breaking News

ఆ హీరోయిన్‌ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నా.. ఆమె చాలా స్పీడు.

Published on Thu, 06/12/2025 - 14:35

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ నిహారిక ఎన్‌.ఎమ్‌ (Niharika NM) టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. మిత్రమండలి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యాడ్‌ ఫేమ్‌ విష్ణు, ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురువారం (జూన్‌ 12న) మిత్రమండలి సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌ ఆద్యంతం నవ్వించేలా ఉంది.

నేను వయసులో చిన్నవాడినే..
అయితే ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ కూడా అంతే సరదాగా సాగింది. తనను హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసిన అల్లు అరవింద్‌ (Allu Aravind)కు హృదయంలో చోటిచ్చానంది నిహారిక. అనంతరం అల్లు అరవింద్‌ స్టేజీ ఎక్కి మాట్లాడాడు. వీళ్లందరూ కలిసి నన్ను పెద్దవాడిని చేస్తున్నారు. నేనేమో ఇంకా యంగ్‌గానే ఫీలవుతున్నాను. ఇక్కడ అమ్మాయి కూడా మనసులో చోటిచ్చానంది. నేనెక్కువగా యంగ్‌ జెనరేషన్‌తో తిరుగుతూ ఉంటాను. వాళ్లతో ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి స్క్రిప్టులు సెలక్ట్‌ చేయాలన్నదానిపై కాస్త పట్టు లభించింది.

కథ తెలీకుండా సినిమా చూడబోతున్నా
ఈ సినిమా డైరెక్టర్‌ విజయేందర్‌ గురించి చెప్పాలి. ఈయన కథ చెప్తాడట.. వినమని వాసు అడిగాడు. సరేనన్నాను. విజయేందర్‌ వచ్చి నా గదిలో కూర్చుని పావుగంట కథ చెప్పాడు. సడన్‌గా నావల్ల కావడం లేదు సర్‌, నేనెళ్లిపోతాను అన్నాడు. ఏమైందని అడిగితే.. మీ రేంజ్‌ వేరు, నా వల్ల కావట్లేదు.. మళ్లీ ఎప్పుడైనా ప్రిపేర్‌ అయ్యి వస్తాను సర్‌ అని చెప్పి వెళ్లిపోయాడు. కథ తెలియకుండానే బన్నీ వాసు సినిమా చూడబోతున్నాను.

ఫేక్‌ ఐడీతో ఫాలో కొట్టా..
అయితే వాసు.. ఈ సినిమా కోసం ఐదారుగురు అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాడు. వీరిలో ఎవరు బాగుంటారు? చెప్పమన్నాడు. నేను నిహారిక ఫోటో చూడగానే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ చూశాం అని చెప్పాను. ఇన్‌స్టాలో ఆమె చాలా స్పీడు. ఓ ఫేక్‌ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నాను. అందులో తప్పేముంది. మా ఒరిజినల్‌ ఐడీతో సోషల్‌ మీడియాకి వస్తే జనాలు పెట్టే కామెంట్లు చూడలేం, చదవలేం. ఆ దరిద్రమంతా ఎందుకని ఫేక్‌ ఐడీతో అందర్నీ ఫాలో అవుతా.. అందర్నీ చూస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా నిహారిక.. పెరుసు, ఇదయం మురళి వంటి చిత్రాల్లో నటించింది.

చదవండి: Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్‌.. అన్నావదినలదే హవా

Videos

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

Photos

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)