Breaking News

'వార్ 2' ఫ్లాప్ దెబ్బకు నిర్మాత షాకింగ్ నిర్ణయం

Published on Mon, 11/03/2025 - 15:33

ఈ ఏడాది భారీ అంచనాలతో రిలీజైన సినిమాల్లో 'వార్ 2' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తొలిసారి హిందీలో చేసిన చిత్రం, హృతిక్ రోషన్ మరో హీరో కావడంతో విడుదలకు ముందు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత రిజల్ట్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో ఘోరమైన నష్టాలు వచ్చాయని మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.

'వార్ 2' తర్వాత ఈ స్పై యూనివర్స్ నుంచి 'ఆల్ఫా' అనే సినిమా రావాలి. ఆలియా భట్, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబరు 25న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు వాయిదా ప్రకటన బయటకొచ్చింది. వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 17న చిత్రం థియేటర్లలోకి వస్తుందని అనౌన్స్ చేశారు.

(ఇదీ చదవండి: శివగామిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇలా మార్చేశారేంటి!)

ఇదంతా చూస్తుంటే నిర్మాణ సంస్థ రిలీజ్ విషయంలో కావాలనే ఇలా చేసిందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే 'వార్ 2' వల్ల ఈ యూనివర్స్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఒకటే స్టోరీని ఎన్నిసార్లు తిప్పితిప్పి తీస్తారా అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో థియేటర్లలోకి 'ఆల్ఫా' వస్తే 'వార్ 2' ఫెయిల్యూర్ ప్రభావం దీనిపై పడే అవకాశముంది. అందుకే నాలుగు నెలలు వాయిదా వేశారా అనిపిస్తుంది.

ఈ యూనివర్స్‌లో ఇప్పటివరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, టైగర్ 3, పఠాన్, వార్  2 చిత్రాలు వచ్చాయి. ఒకప్పటితో పోలిస్తే ఈ యూనివర్స్‌పై ఇప్పుడు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపించట్లేదు. దీంతో 'ఆల్ఫా' ఫలితం అనేది నిర్మాణ సంస్థకు చాలా కీలకం. ఒకవేళ మూవీ హిట్ అయితే పర్లేదు. తేడా కొడితే మాత్రం తర్వాత అనుకున్న 'పఠాన్ vs టైగర్' లాంటివి అటకెక్కేయొచ్చు.

(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)