"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News
అక్కినేని హీరో సినిమా.. ఎట్టా ఎట్టా అంటోన్న అఖిల్..!
Published on Thu, 04/16/2026 - 16:48
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎట్టా ఎట్టా అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ సాంగ్ ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ఓ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Tags : 1