Breaking News

నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్

Published on Sat, 01/06/2024 - 13:58

సంక్రాంతికి దాదాపు నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏ సినిమాకు ఎప్పుడు వెళ్లాలా అని అందరూ ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరోవైపు పండగ సీజన్‌ని క్యాష్ పలు చిన్న సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. కాకపోతే థియేటర్లు దొరికే ఛాన్స్ లేదు కాబట్టి ఓటీటీల వైపు చూస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ తెలుగు సినిమా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయింది. ఇంతకీ ఏంటా మూవీ?

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన అజయ్ కతుర్వర్.. బిగ్‌బాస్ ఓటీటీ షోతో కాస్తోకూస్తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ షోలో పాల్గొన్న తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. అలా చేసిన సినిమానే 'అజయ్ గాడు'. దాదాపు ఏడాదిన్నర క్రితమే అంతా రెడీ అయినప్పటికీ.. కారణం ఏంటో తెలీదు గానీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు ఈ సినిమాకు మోక్షం కలిగింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అజయ్, భానుశ్రీ, శ్వేత మెహతా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు టీమ్ ఏ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చంద‌న కొప్పిశెట్టితో క‌లిసి హీరో అజ‌య్ క‌తుర్వార్ స్వ‌యంగా ఈ సినిమాని నిర్మించాడు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పండగపూట థియేటర్లకు వెళ్లే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చుని ఈ సినిమా ఫ్రీగా చూడొచ్చు.

(ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)