Breaking News

ఐశ్వర్యరాయ్‌ కారుకు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

Published on Wed, 03/26/2025 - 19:58

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ముంబయిలో ఆమె కారును ఓ బస్సు ఢీకొట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఐశ్వర్య బాడీ గార్డ్స్ వెంటనే కారులో నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో లేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఐశ్వర్యరాయ్ కారును బస్సు వెనుక నుంచి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే కారుకు ఎలాంటి తీవ్రమైన నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తర్వాత కారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.
అక్కడ పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని జుహుకి చెందిన ఒక పోలీసు అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్యరాయ్ అభిమానులు కాస్తా ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆమె క్షేమం గురించి పలువురు ఆరా తీశారు.

కాగా.. ఐశ్వర్యరాయ్‌  చివరిసారిగా పొన్నియిన్ సెల్వన్: పార్ట్- 2లో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో ఆమె ఉత్తమ నటిగా ప్రధాన పాత్ర (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం 2023లో విడుదలైన సంగతి తెలిసిందే.
 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)