Breaking News

రాజకీయాల్లోకి హీరోయిన్‌ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో..

Published on Thu, 08/18/2022 - 08:30

మౌనం పేసియదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన త్రిష ఆ తర్వాత తమిళం, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో అగ్ర కథానాయికగా రాణిస్తోంది. 39 ఏళ్ల వయసులోనూ కథానాయకిగా నటిస్తున్న త్రిష సినీ పయనం రెండు దశాబ్దాలు. జయాపజయాలకు అతీతంగా ఈమెకు అవకాశాలు వరిస్తునే ఉన్నాయి. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్‌ సెల్వం చిత్రంలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రపొందుతున్న ఈ చిత్ర తొలిభాగం సెప్టెంబర్‌ 30వ తేదీ తెరపై రావడానికి ముస్తాబవుతోంది.

కాగా త్వరలో విజయ్‌కు జంటగా నటించే భారీ చిత్ర అవకాశం ఈమెను వరించింది. అయితే ఈ అయితే ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి పలు సంచలన విషయాలు వెలుగు చూసినా ఆమె ఇప్పటికీ సింగిలే. అసలు విషయం ఏమిటంటే త్రిష ప్రస్తుత రాజకీయాలకు మొగ్గుచూపుతున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత మాదిరి రాణించాలని ఈమె కలలు కంటున్నట్లు సమాచారం. దీంతో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయపరంగా ఎదగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భావాల వెనుక నటుడు విజయ్‌ ఉన్నట్లు, ఆయనే త్రిషను రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య మంచి ప్రెండ్‌షిఫ్‌ ఉంది.

ఇప్పటికే నాలుగుచిత్రాల్లో కలిసి నటించారు. తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. అదే విధంగా నటుడు విజయ్‌కి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే త్రిష ఎంజీఆర్, జయలలితల మాదిరి రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నారని భావించాల్సి వుంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? అవాస్తవం ఎంత? అసలు త్రిష రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందా? ఈ ప్రశ్నలకు భవిష్యత్తే సమాధానం చెప్పాలి. 

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)