Breaking News

పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్!

Published on Wed, 01/31/2024 - 07:48

గత రెండు మూడు నెలల్లో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు నిశ్చితార్థం చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. చెప్పుకొంటే ఈ లిస్టులో చాలామంది తెలుగు స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు తెలుగమ్మాయి శ్రీ దివ్య కూడా తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఎప్పుడు చేసుకుంటాననేది చెప్పేసింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?)

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రీ దివ్య.. 'హనుమాన్ జంక్షన్', 'యువరాజు', 'వీడే' లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. 'మనసారా' అనే సినిమాతో హీరోయిన్ అయిపోయింది. దీని తర్వాత బస్‌స్టాప్, కేరింత లాంటి మూవీస్ చేసినప్పటికీ ఎందుకో టాలీవుడ్‌లో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలోకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరసపెట్టి చిత్రాల్లో నటించింది. 2013లో మొదలుపెడితే ఇప్పటికీ చేస్తూనే ఉంది.

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో శ్రీ దివ్యకు తమిళంలో కూడా అవకాశాలు తగ్గాయి. అయితే ఓ కమెడియన్ ఇచ్చిన పార్టీలో తప్ప తాగి పడిపోయిందని, దీంతో ఈమె పేరు డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఛాన్సులు కూడా తగ్గిపోయాయని మాట్లాడుకున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే హీరోయిన్‌గా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అలా సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుందట. ఈ విషయమే సన్నిహితుల దగ్గర చెప్పిందట. దీనిపై ఆమె వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్)

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)