Breaking News

తల్లయిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటో వైరల్

Published on Sun, 12/07/2025 - 14:29

అప్పట్లో సీరియల్ పార్వతి దేవిగా గుర్తింపు తెచ్చుకున్న సోనారిక.. శుభవార్త చెప్పేసింది. తాను కూతురికి జన్మనిచ్చినట్లు బయటపెట్టింది. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో తోటి నటీనటులు, నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ 9 తనూజ చెల్లి.. ఫోటో వైరల్‌)

'దేవాన్ కే దేవ్ మహాదేవ్' అనే సీరియల్‌లో పార్వతి దేవిగా నటించిన సోనారిక.. దేశవ్యాప్తంగా మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. అలా మరో రెండు మూడు సీరియల్స్‌లో నటించింది. తర్వాత తెలుగులోనూ 'జాదుగాడు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'స్పీడున్నోడు', 'ఈడోరకం ఆడోరకం' సినిమాల్లో మంచు విష్ణుకి జోడీగా చేసింది. కానీ ఇవి హిట్ కాకపోవడంతో టాలీవుడ్‌లో మళ్లీ కనిపించలేదు. చివరగా 2022లో 'హిందుత్వ' అనే హిందీ మూవీ చేసింది.

చివరగా సినిమా చేసిన ఏడాదిలోనే వ్యాపారవేత్త వికాస్ పరశార్‌తో నిశ్చితార్థం చేసుకుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి గతేడాది పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసిన సోనారిక.. కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు డిసెంబరు 5న తనకు ఆడబిడ్డ పుట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: 60 ఏళ్లకు లవ్‌లో పడాలనుకోలే.. కానీ తనను చూడగానే: ఆమిర్ ఖాన్)

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)