Breaking News

8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే

Published on Tue, 03/03/2026 - 15:48

హీరోయిన్ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో హోమ్లీ పాత్రలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ చాలానే మూవీస్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. తనకు గతంలో పెద్ద ప్రమాదం జరిగిందని, 8 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఓ దర్శకుడి వల్లే మళ్లీ ఇలా ఇప్పుడు మీ ముందున్నానని చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ ఈ విషయాల్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

'కెరీర్ పీక్ స్టేజీలో వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఓ ఘోర ప్రమాదం జరిగింది. అందులో నా చేతులు, కాళ్లు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం నిలబడటానికి కూడా ఎనిమిది నెలలు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నరకం అనుభవించాను. కెరీర్ అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాను. ఆ టైంలో దర్శకుడు కరు పళనియప్పన్ 'పార్థిబన్ కనవు' స్టోరీతో నా దగ్గరకు వచ్చారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిసినా సరే నాపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం. ఆయన ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చనాను. ఆ దశ చాలా కష్టమైనది. కానీ అదే నన్ను మరింత బలంగా మార్చింది' అని స్నేహ ఎమోషనల్ అయింది.

తెలుగు కుటుంబానికే చెందిన స్నేహ అసలు పేరు సుహాసిని. ముంబైలో పుట్టి, షార్జాలో పెరిగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈమెని చూసిన ఓ మలయాళ నిర్మాత.. హీరోయిన్‌గా అవకాశమిచ్చాడు. అలా 2000లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'ప్రియమైన నీకు' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, మధుమాసంతో పాటు చాలానే మూవీస్ చేసింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకుంది. అనంతరం సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. రీసెంట్ టైంలో అయితే దళపతి విజయ్ 'గోట్'లో కనిపించింది.

(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)