Breaking News

ఏడాదిన్నర గ్యాప్.. ఇప్పుడేమో చేతిలో 8 సినిమాలు

Published on Fri, 09/12/2025 - 12:53

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా చాలా తక్కువగానే సినిమాలు చేస్తున్నారు. ఉన్నంతలో రష్మిక పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె కంటే బిజీగా ఉన్న మరో బ్యూటీ ఉంది. ఆమెనే మలయాళ బ్యూటీ సంయుక్త. దాదాపు ఏడాదిన్నరగా ఈమె నుంచి కొత్త మూవీ అప్డేట్ అనేదే లేదు. అలాంటిది ఇప్పుడు ఈమె చేతిలో ఏకంగా 8 మూవీస్ ఉండటం విశేషం. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

2016 నుంచి మలయాళంలో సినిమాలు చేస్తున్న సంయుక్త.. 'భీమ్లా నాయక్'తో టాలీవుడ్‌లోకి వచ్చింది. దీని తర్వాత బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరస హిట్స్ అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే 2023లో ఈమె హీరోయిన్‌గా చేసిన 'డెవిల్' ఫ్లాప్ అయింది. గతేడాది ఓ తెలుగు మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. అప్పటినుంచి ఈమె నుంచి రిలీజులు ఏం లేవు. తీరా ఇప్పుడు చూస్తే ఎనిమిది చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.

(ఇదీ చదవండి: 'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం)

సంయుక్త చేస్తున్న వాటిలో బాలకృష్ణ 'అఖండ 2', పూరీ-విజయ్ సేతుపతి సినిమా, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ', బెల్లంకొండ శ్రీనివాస్ 'హైందవ', నిఖిల్ 'స్వయంభు', లారెన్స్ 'బెంజ్', మహారాణి అనే హిందీ చిత్రం, తెలుగులో ఓ ఫిమేల్ సెంట్రిక్ చిత్రం ఈమె చేతిలో ప్రస్తుతం ఉన్నాయి. వీటిలో 'అఖండ 2'.. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ కూడా దాదాపు వచ్చే ఏడాది, ఆపై ఏడాది థియేటర్లలోకి రానున్నాయి.

సంయుక్త ప్రస్తుతం చేస్తున్న వాటిలో పూరీ-విజయ్ సేతుపతి, అఖండ 2, స్వయంభు.. పాన్ ఇండియా టార్గెట్‌గా తీస్తున్న మిగిలినవన్నీ కూడా ఆయా భాషల్లో తీస్తున్నారు. మరి వీటి వల్ల సంయుక్త కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా? హీరోయిన్‍‌గా నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: ‍'కిష్కింధపురి' సినిమా రివ్యూ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)