Breaking News

హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం

Published on Fri, 09/19/2025 - 17:32

టాలీవుడ్‪‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం క్రితమే ఈయన చనిపోయారు కానీ ఇప్పడు సదా తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలోనే సదా స్నేహితులు, పలువురు నెటిజన్లు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

'నాన్న చనిపోయి వారం రోజులైంది కానీ ఓ యుగం గడిచినట్లు అనిపిస్తుంది. సినిమా అనేది అమ్మాయిలకు ఏమంత సేఫ్ కాదు అనే రోజుల్లోనే కుటుంబాన్ని ఎదిరించి మరీ నాకు అండగా నిలిచారు. అమ్మకు కుదరకపోవడం వల్ల నాతో పాటు షూటింగ్‌లకు రాలేకపోయేది. దీంతో నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కొన్నేళ్ల పాటు నాతో కూడా షూటింగ్స్‌కి వచ్చారు. తిరిగి అమ్మ నా బాధ్యతల్ని తీసుకున్న తర్వాత నాన్న ఓ చిన్న క్లినిక్ తెరిచారు. ఎంతో మంది మనుషులు, జంతువులకు ఆపద్బాంధవుడు అయ్యారు'

(ఇదీ చదవండి: హీరో శర్వానంద్‌ దంపతులు విడిపోయారా?)

'నేను తన కూతురు కావడం గర్వకారణం అని అందరూ ఆయనతో చెబుతున్నారని అనేవారు. కానీ ఈ రోజు ఆయన కూతురిగా నేను ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాను. తన చుట్టూ ఉన్నవాళ్ల కోసం ప్రేమ, ఆప్యాయతని పంచిన ఆయనని చూసి గర్వపడుతున్నాను. ఆయన నిజంగా ఓ వెలకట్టలేని మనిషి. మిస్ యూ నాన్న' అని సదా ఎమోషనల్‌గా అవుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

మహారాష్ట్రకు చెందిన సదా తండ్రి ముస్లిం కాగా తల్లి హిందూ. ఈయన డాక్టర్‌గా పనిచేసేవారు. తల్లి ప్రభుత్వ ఉద్యోగి. సదా టీనేజీలో హీరోయిన్ అయిపోయింది. 2002లో 'జయం' సినిమాతో నటిగా మారింది. తర్వాత ప్రాణం, నాగ, దొంగా దొంగది, లీలా మహల్ సెంటర్, చుక్కల్లో చంద్రుడు, అపరిచితుడు, వీరభద్ర తదితర చిత్రాల్లో నటించింది. గత కొన్నేళ్లలో హీరోయిన్‌గా ఆఫర్స్ తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు మూవీస్ చేసింది. మరోవైపు రియాలిటీ షోకు జడ్జిగానూ చేసింది. చివరగా 'మదగజరాజా' సినిమాలో కనిపించింది.

(ఇదీ చదవండి: రౌడీ టీ షర్ట్.. మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)