Breaking News

నిజమైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన

Published on Tue, 02/17/2026 - 15:28

నటి ప్రత్యూష కేసులో ఎట్టకేలకు తుదితీర్పు వెలువడింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని పేర్కొంది. అలానే అతడి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలుశిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు అనంతరం స్పందించిన ప్రత్యూష తల్లి సరోజిని దేవి.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత)

'హైకోర్డు తీర్పునే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎక్కడున్నా సరే సిద్ధార్థ్ రెడ్డి వచ్చి లొంగిపోవాలని తీర్పులో పేర్కొన్నారు. రెండున్నరేళ్లని ఖరారు చేశారని అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే నా కూతురిపై అత్యాచారం జరిగిందని నేను నమ్ముతున్నా. చంపేశారని కూడా నమ్ముతున్నా. నా కూతురు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఎవరేం చెప్పినా ఈ రెండింటి గురించి వేరేది నమ్మే పరిస్థితిలో లేను'

'నా బిడ్డకు నిజమైన న్యాయం మాత్రం దక్కలేదు. సిద్ధార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడాలని నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాది సుప్రీంకోర్టులో 14 ఏళ్ల పోరాటం. 2011 నుంచి పోరాడుతూనే ఉన్నాను. హైకోర్టులో ఇచ్చిన రెండున్నరేళ్ల శిక్షని.. ఇక్కడ రెట్టింపు చేస్తారని భావించాను. కానీ సుప్రీం ఇచ్చిన తీర్పు తర్వాత నా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. నా బిడ్డ ఆత్మకు శాంతి కలగదలేదని అనుకుంటున్నాను' అని సరోజిని దేవి చెప్పుకొచ్చారు.

ప్రత్యూష ఎవరనేది ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90స్ ప్రేక్షకులని అడిగితే చెప్తారు. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు తన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడింది. సిద్ధార్థ్ కుటుంబం.. ఈ ప్రేమని అంగీకరించకపోవడంతో వీళ్లిద్దరూ 2002 ఫిబ్రవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూషని ఆత్మహత్యకు ప్రేరేపించాడని చెప్పి సిద్ధార్థ్ రెడ్డికి తొలుత ఐదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే 2011లో ఈ శిక్షని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)