Breaking News

నీ వల్లే నా జీవితం ఇలా.. పాయల్ రాజ్‌పుత్ భావోద్వేగ పోస్ట్

Published on Fri, 02/10/2023 - 18:04

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే తనదైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్‌ డోస్‌తో యూత్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న పాయల్‌ గతంలో పంజాబీ నటుడు, గాయకుడు సౌరభ్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు  ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది భామ.

తాజాగా అతనిపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తపరిచింది. ఇవాళ సౌరభ్ బర్త్‌డే సందర్భంగా అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరింత సన్నిహితంగా దిగిన చిత్రాలను షేర్ చేసింది పంజాబీ భామ. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

పాయల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'గత కొన్నేళ్లు మీకు చాలా కష్టంగా గడిచాయని  తెలుసు. జీవితం చాలా కఠినమైంది. అలాగే మీరు కూడా కఠినం. నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.  మీ చిరునవ్వు, ప్రేమ నా జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా చేస్తాయి. నేను నిరాశగా ఉన్నప్పుడు మీరు నన్ను నవ్విస్తారు. మీరు నాకు బహుమతులిచ్చారు. నా జీవితాన్ని పంచుకోవడంలో చాలా సంతోషంగా ఉన్న వ్యక్తి మీరే. ఆ దేవుడు మీకు దీర్ఘాయువుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేసింది. 

అయితే గతంలోనూ  సౌరభ్‌తో ఉన్న అనుబంధాన్ని తెలిపింది పాయల్‌ రాజ్‌పుత్.  ఓ ప్రోగ్రామ్‌లో సౌరభ్‌తో కలిసి పాయల్‌ డ్యాన్స్‌ చేసింది. ఆ తర్వాత సౌరభ్‌కు లిప్‌ కిస్‌ ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. హైదరాబాద్‌లో ఫ్లాట్‌ తీసుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ సౌరభ్‌తో సహాజీవనం చేస్తోంది. ఇక్కడి నుంచే తెలుగు, తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. అయితే టాలీవుడ్‌లో ఇటీవల ఆమె నటించిన జిన్నా మూవీ అంత సక్సెస్ కాలేదు. 


 

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)