Breaking News

ఇండియా వదిలేస్తా ఇరాన్‌ వెళ్లిపోతా.. బాలీవుడ్‌ నటి సంచలన ప్రకటన

Published on Thu, 03/05/2026 - 21:13

దుబాయ్‌ సహా పశ్చిమాసియాలో చిక్కుకున్న బాలీవుడ్‌ నటీనటులు కావచ్చు ఇతర సెలబ్రిటీలు అందరూ ఇండియాకు వచ్చేదారులు ఎక్కడా అని వెదుక్కుంటుంటే...హాయిగా ఇండియాలో కూర్చుని సినిమాలు చేసుకుంటున్న ఓ బాలీవుడ్‌ నటి మాత్రం ఇక తాను ఇక్కడ ఉండలేనంటోంది. ఈ యుద్ధానికి కేంద్ర బిందువైన ఇరాన్‌కే వెళ్లిపోతానంటోంది. ఇంతకీ ఎవరా నటి ఎందుకీ విరక్తి?

ఆమె పేరు మందనా కరిమి, ఇరాన్‌కు చెందిన సినీ తార.  కొన్నేళ్ల క్రితమే ఫ్యాషన్‌ రన్ వేలపై అడుగులతో మన దేశంలో ప్రారంభమై అక్కడ నుంచి బాలీవుడ్‌ దాకా సాగింది.  భారత మోడలింగ్‌ రంగంలో స్థిరపడిన తర్వాత, ఆమె భాగ్‌ జానీ  క్యా కూల్‌ హై హమ్‌ 3 వంటి చిత్రాలలో వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంది.  ఫ్యాషన్, ప్రకటనలు రియాలిటీ టెలివిజన్‌ ద్వారా కూడా ఇండియా ఆమెను ఆదరించింది. మరొవైపు ప్రస్తుత ఇరాన్‌–అమెరికా –ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల తర్వాత తన చుట్టూ పరిస్థితి మారిపోయింది అంటోందీమె.  ఇరాన్ లో జన్మించిన ఈ నటి ఇప్పటిదాకా తన చుట్టూ స్నేహితులుగా ఉన్నవారిలో వచ్చిన మార్పులు తనకు అంతుపట్డడం లేదని వాపోతోంది. 

ఈ పరిస్థితుల్లో తనకు ఇండియాలో ఉండడం నచ్చడం లేదని, ఇక పెట్టేబేడా సర్ధుకుని ఇరాన్‌కి వెళ్లిపోవడమే శరణ్యం అనీ స్పష్టం చేస్తోంది. తనకు ఇండియా ఎంతో ఇచ్చింది. కానీ...వాయిస్‌ మాత్రం ఇవ్వలేదంటోంది. అదే విధంగా మరో  ఇరాన్‌ నటి ఎల్నాజ్‌ నొరౌజీ  ఇరాన్‌ నేత తాజా దాడుల్లో మృతి చెందిన అహ్మద్ ఖొమేని మృతి పట్ల భారత్‌లో కొందరు ముస్లింలు  చేపట్టిన నిరసన ప్రదర్శనలను ఆక్షేపిస్తోంది. మతం పేరుతో  ఖొమేని సాగించిన అరాచకాల గురించిన అవగాహన లేకపోవడమే దీనికి కారణం కావచ్చునని ఆమె అభిప్రాయపడుతోంది. ఈ నటి  దాదాపు దశాబ్దం క్రితం భారతదేశానికి వచ్చింది నెట్‌ఫ్లిక్స్‌ సేక్రెడ్‌ గేమ్స్‌ ద్వారా వేగంగా పాప్యులారిటీ అందుకుంది. 

వీరు కాకుండా భారత్‌లోని మరికొందరు ఇరానియన్‌ మూలాలున్న నటీనటులు ఎవరంటే...

  • ఇరానియన్‌ నటుడు సజ్జాద్‌ డెలాఫ్రూజ్‌ సల్మాన్‌ ఖాన్‌ సరసన టైగర్‌ జిందా హైలో శక్తివంతమైన పాత్ర ద్వారా  బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు.  తరువాత గూఢచర్య థ్రిల్లర్‌ స్పెషల్‌ ఆప్స్‌లో కనిపిస్తాడు.

  • బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం తన తల్లి, ఇరానియన్‌ జొరాస్ట్రియన్‌ ద్వారా ఇరానియన్‌ మూలాలను కలిగి ఉన్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

  • ఇడియట్స్‌  మున్నా భాయ్‌ ఎంబిబిఎస్‌ చిత్రాల్లోని పాత్రలతో పేరొందిన ప్రముఖ నటుడు బోమన్‌ ఇరానీ కూడా ముంబైలోని ఇరానియన్‌ జొరాస్ట్రియన్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు