Breaking News

మరోసారి హంగామా చేసిన నటి కల్పిక

Published on Tue, 07/29/2025 - 11:10

దాదాపు నెలరోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో అర్థరాత్రి నటి కల్పిక హంగామా చేసింది. ఈ విషయమై ఆమెపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అది ఇంకా విచారణలో ఉంది. ఇప్పుడు మరోసారి కల్పిక.. హైదరాబాద్ సమీపంలో మొయినాబాద్‌లో ఉన్న ఓ రిసార్ట్‌లో హడావుడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌ మొయినాబాద్‌ ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌కి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా వచ్చిన కల్పిక.. రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మెనూ కార్డ్ విసిరేయడం, రూమ్ తాళాల్ని మేనేజర్ ముఖంపై విసరడం, అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడం లాంటివి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్‌ సినిమా)

అయితే తాను సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని కల్పిక.. ఈ వివాదంపై స్పందించింది. ఓ వీడియోని కూడా రికార్డ్ చేసింది. రిసార్టులో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవని, కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే తనతో మేనేజర్ వాగ్వాదానికి దిగాడని చెప్పుకొచ్చింది. ఎంత నిదానంగా చెప్పినా వినకపోవడంతో, మేనేజర్‌తో గొడవకు దిగాల్సి వచ్చిందని చెప్పింది.

గత కొన్నాళ్లుగా కల్పిక సరిగా సినిమాలు చేయడమే లేదు. అలాంటిది ఇప్పుడు వరస వివాదాల్లో నిలిచి ఈమె వార్తల్లో నిలిచింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే చేస్తుందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే త్వరలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ కొత్త సీజన్‌లో కల్పిక కూడా ఓ కంటెస్టెంట్‌గా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. అందుకేనా ఈ హడావుడి అంతా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: కింగ్డమ్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)