Breaking News

'పెళ్లి చేసుకుంటానని వాడుకున్నాడు'.. అజాజ్ ఖాన్‌పై నటి తీవ్ర ఆరోపణలు!

Published on Mon, 05/05/2025 - 10:42

బాలీవుడ్ నటుడు ‍‍అజాజ్ ఖాన్‌ వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. అతను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హౌస్ అరెస్ట్‌ అనే షోలో విపరీతమైన, అసభ్యకరమైన కంటెంట్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ షోను ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ బ్యాన్‌ చేసింది. ఈ అసభ్యకరమైన కంటెంట్‌ ప్రసారం చేస్తోన్న అజాజ్‌ ఖాన్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంలో నడుస్తుండగానే అజాజ్‌ ఖాన్‌పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అజాజ్‌ ఖాన్‌పై చార్‌కోప్‌ పీఎస్‌లో కంప్లైంట్‌ ఇచ్చింది. దీంతో అతనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.

అజాజ్ ఖాన్ తన ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో తనకు ఓ పాత్ర ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేశాడని నటి ఆరోపించింది. మార్చి 25న తన నివాసంలోనే నాపై అత్యాచారం చేశాడని.. రెండు సార్లు తనను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని చార్కోప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాకు నాలుగు వివాహాలకు అనుమతి ఉందని తనకు చెప్పాడని నటి ప్రస్తావించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసిన చార్కోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇ‍ప్పటికే ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో మహిళలను అసభ్యకరంగా చూపించినందుకు అజాజ్ ఖాన్‌పై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)