Breaking News

ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత

Published on Wed, 02/18/2026 - 08:22

ఇండస్ట్రీలో విషాదం. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఇది జరిగినప్పటికీ.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలోనే హిందీ సెలబ్రిటీలు అందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నివాళి అర్పిస్తున్నారు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు)

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, షేర్ షా తదితర సినిమాలతో హీరోగా కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా.. ఫిబ్రవరి 14న ఢిల్లీ తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భార్య కియారా అడ్వానీతో కలిసి ఢిల్లీ వెళ్లిన సిద్ధార్థ్.. అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కష్టకాలంలో కుటుంబంతో కలిసి ఉ‍న్నారు. నాన్న చనిపోయిన విషయాన్ని మర్చిపోలేకపోతున్న సిద్ధార్థ్.. మంగళవారం రాత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని బోలెడన్ని ఫొటోలని పంచుకున్నాడు.

'ఆయన నిజాయతీ కలిగిన వ్యక్తి. ఎప్పుడూ తలవంచలేదు. జీవితం ఆయన్ని పరీక్షించినప్పుడు కూడా బలంగా నిలబడ్డారు. మర్చంట్ నేవీ కెప్టెన్‌గా సముద్రాన్ని శాసించడం దగ్గర నుంచి అనారోగ్యాన్ని ఎదుర్కోవడం వరకు ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. స్ట్రోక్ వల్ల ఆయన వీల్ ఛైర్‌కే పరిమితమైనప్పటికీ బలంగా నిలబడ్డారు. మీ పాజిటివిటీ ఇప్పటికీ ఈ కుటుంబాన్ని కలిపి ఉంచుతోంది. నిద్రలోనే మమ్మల్ని మీరు వదిలి వెళ్లారు. మీరు లేని లోటు తీరనిది. మీ వల్లే నేను ఇలా ఉన్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను నాన్న' అని సిద్ధార్థ్ రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: సరైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)