YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి
Breaking News
జనసైనికులా? గూండాలా?.. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం..
Published on Fri, 07/03/2026 - 19:17
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. ఈ కేసులో జన సైనికుల ఓవరాక్షన్ చేస్తున్నారంటూ మరో వీడియో రిలీజ్ చేశారు. జన సైనికుల తీరుపై ఆయన మండిపడ్డారు. జనసైనికులు గూండాల్లా రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించేవాళ్లను చంపేస్తారా ఏంటి? అని నిలదీశారు.
పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇదంతా దేశం చూస్తోందని ఆయన అన్నారు. బిహేవియర్ యువర్ సెల్ఫ్ అంటూ జన సైనికులను ఉద్దేశించి మరో వీడియో రిలీజ్ చేశారు.
కాగా.. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో రావణ్ని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అతడిని కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే విచారణ తర్వాత పిఠాపురంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలోనే వెంటనే మరో కేసులో రావణ్ని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర హైడ్రామా నెలకొంది. ఆ తర్వాత రావణ్ని మచిలీపట్నం తరలించారు.
What is this act of your janasena party cadres . ప్రశ్నిస్తే చంపేస్తారా ???. @ncbn @PawanKalyan … Will you take action against this Rogue behaviour. #justasking pic.twitter.com/HZYEIaKbfp
— Prakash Raj (@prakashraaj) July 3, 2026
Tags : 1