Badvel : పేదల భూములు కొట్టేస్తున్న పచ్చ గద్దలు.. మాకు చావే గతి
Breaking News
హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్
Published on Sun, 02/15/2026 - 15:41
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'ఏఐ' అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తమ చిత్రాల్లో ఎలాంటి సీన్లు.. ఈ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించాలేదని హీరోలు దర్శకనిర్మాతలు చెప్పుకొంటున్నారు. కష్టపడి విజువల్ ఎఫెక్ట్స్ చేయించామని అంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. యువహీరో నిఖిల్ మాత్రం ఏఐ గురించి చెబుతూనే మరో మూవీ గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)
నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'స్వయంభు'. నాలుగు రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఏమంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. కంటెంట్ పర్లేదు అన్నప్పటికీ ఎక్కువమంది 'బాహుబలి'తో పోల్చి చూస్తున్నారు. హీరోహీరోయిన్ పాత్రలు అలానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అలానే టీజర్ క్వాలిటీపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో హెచ్డీఆర్ క్వాలిటీతో ఇప్పుడు మరోసారి టీజర్ అప్లోడ్ చేశారు. ఇదే విషయాన్ని ట్విటర్లో చెప్పిన నిఖిల్.. రీసెంట్గా వచ్చిన ఓ సినిమాలా మా దానిలో ఎలాంటి ఏఐ ఉపయోగించలేదు అని అన్నాడు.
మరి నిఖిల్ ఏ సినిమా గురించి అన్నాడా? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. సరిగ్గా నిఖిల్ ట్వీట్ చేసే సమయానికి 'నాగబంధనం' మూవీ టీజర్ రిలీజైంది. మరి ఈ చిత్రంపైనే నిఖిల్ కౌంటర్ వేశాడా అనిపిస్తోంది. ఎందుకంటే రెండు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలే. ఈ వేసవిలోనే థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్.. కావాలనే నెగిటివ్ అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడా అనిపిస్తుంది. బహుశా ఇదో రకం పబ్లిసిటీ టెక్నిక్ కావొచ్చేమో? చూడాలి మరి దీని గురించి నిఖిల్ ఏమని క్లారిటీ ఇస్తాడో?
(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా)
Tags : 1