Breaking News

ఫిల్మ్‌నగర్‌లో కలకలం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు!

Published on Fri, 07/10/2026 - 10:34

ఫిల్మ్‌నగర్‌లో ఓ కారు ప్రమాదం కలకలం రేపింది. అదుపుతప్పి వాహనం నటుడు ధర్మ మహేష్‌ ఇంట్లోకి దూసుకెళ్లడం ఘటన చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో.. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫిల్మ్‌నగర్‌ పరిధిలో నటుడు ధర్మ మహేష్‌ నివాసం ఉంది. అయితే గత అర్ధరాత్రి దాటాక ఓ కారు అదుపుతప్పి ఆ ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గేటు, ప్రహారీ గోడ ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం తప్పింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది.

మద్యం మత్తులోనా?..
ప్రమాద సమయంలో కారులో కొందరు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. కారు నడిపిన తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొంటూ ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు నటుడి కుటుంబం సమాచారం అందించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వాళ్లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు వేగం, డ్రైవర్‌ పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపారా? అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, చట్టపరమైన చర్యలపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ధర్మ మహేష్ (కాకాని ధర్మ) తెలుగు సినీ నటుడు. అసలు పేరు కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్. విజయవాడకు చెందిన మహేష్‌.. ఇంజినీరింగ్‌ (బీటెక్‌) పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో విశాఖపట్నంలోని సత్యానంద్‌ ఫిల్మ్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘సింధూరం’ (2023), ‘డ్రింకర్‌ సాయి’ (2024)చిత్రాల్లో నటించాడు. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఆ మధ్య వ్యక్తిగత వివాదాలతోనూ ధర్మ మహేష్‌ వార్తల్లోకి ఎక్కాడు.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)