Breaking News

జైల్లో ఉండలేకపోతున్నా.. ఒక చుక్క విషమివ్వండి: స్టార్ హీరో

Published on Tue, 09/09/2025 - 15:59

కన్నడ స్టార్ హీరో దర్శన్.. జడ్జి ముందు బోరున విలపించాడు. తన అభిమాని రేణుకస్వామి అనే వ్యక్తిని హతమార్చిన కేసులో జైల్లో ఉన్న దర్శన్.. నెలవారీ హియరింగ్‌లో భాగంగా మంగళవారం జైలు నుంచే వీడియో కాల్ ద్వారా కోర్ట్ హియరింగ్‪‌లో పాల్గొన్నాడు. జైల్లో అస్సలు ఉండలేకపోతున్నానని, తన జీవితం దుర్భరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు.

'నెల రోజులకు పైనే అవుతుంది. ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. 'అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు.

(ఇదీ చదవండి: మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్)

గతేడాది తన అభిమాని రేణుకస్వామిని.. హీరో దర్శన్ హత్య చేశాడు. తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు సదరు రేణుకస్వామి అసభ్యకర మెసేజులు పంపుతుండటమే దీనికి కారణం. తొలుత అతడిని కిడ్నాప్ చేసిన దర్శన్.. బెంగళూరులోని ఓ షెడ్‌లో పెట్టి చిత్రహింసలు చేశాడు. తర్వాత రేణుకస్వామి బాడీ.. దగ్గరలోని ఓ నాళాలో దొరికింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ తదితరుల్ని గతేడాది జూన్‌లో అరెస్ట్ చేశారు.

అయితే కొన్ని నెలల పాటు దర్శన్ జైల్లో ఉన్నాడు. గతేడాది డిసెంబరులో కర్ణాటక హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చాడు. కానీ సుప్రీం కోర్ట్ ఆ బెయిల్‌ని రద్దు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్.. బయట ఉంటే సాక్ష‍్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మళ్లీ దర్శన్ అరెస్ట్ అయ్యాడు. తాజాగా తనకు జైలులో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని బోరున ఏడ్చేశాడు. కనీసం తలగడ, బెడ్ షీట్స్, ఇంటిలో తయారు చేసిన ఆహారం లాంటివి అయినా సరే అనుమతించాలని దర్శన్.. జడ్జిని కోరాడు.

(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్)

Videos

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)