Breaking News

అందుకే నన్ను పంపించేశారు.. అతనంటే భయమా?: ఆట సందీప్

Published on Thu, 11/02/2023 - 19:08

ఉల్టా పుల్టా అంటూ మొదలైన బిగ్ బాస్ షో అభిమానులను అలరిస్తోంది. ఈ వారంలో హౌస్‌మేట్స్ మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నామినేట్ చేసే సమయంలో కంటెస్టెంట్స్ మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఈసారి కూడా మరింత హాట్‌హాట్‌గా మారిపోయింది. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవ్వడంతో బిగ్ బాస్  ఈ వారం కెప్టెన్సీ కంటెండ‌ర్ కోసం కంటెస్టంట్స్‌కు గేమ్ టాస్కులు ఇచ్చాడు.  ఇంటి స‌భ్యుల‌ను రెండు టీమ్‌లుగా విభ‌జించాడు. వీర‌సింహాలు టీమ్‌లో యావ‌ర్‌, గౌత‌మ్‌, భోలె, తేజ‌, శోభా, ర‌తిక ఉండ‌గా.. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ, ప్రియాంక, అర్జున్, అశ్విని గ‌ర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు.

రైతుబిడ్డ అవుట్!

అయితే రెండు టీమ్స్‌కు బిగ్‌బాస్ మొద‌ట జంపింగ్ జ‌పాంగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీర‌సింహాలు టీమ్ గెలవ‌డంతో వీరికి అవ‌త‌లి టీమ్‌లో ఒక‌రిని గేమ్ నుంచి తొల‌గించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అంద‌రూ మాట్లాడుకుని పల్లవి ప్ర‌శాంత్‌ను గేమ్ నుంచి తప్పించారు. త‌న‌ను ఆట‌లో నుంచి ప‌క్క‌కు తోసేయ‌డంతో రైతుబిడ్డ ఏడ్చేశాడు. శివాజీ త‌న చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్ర‌శాంత్ మెడ‌లో వేయించారు. 

అతనంటే భయమా?

అయితే తాజాగా పల్లవి ప్రశాంత్‌ను గేమ్ నుంచి తప్పించడంపై ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పాపం రా.. ప్రశాంత్ మంచి ప్లేయర్ ఎందుకు గేమ్ నుంచి పక్కన పెట్టారు. అతనంటే భయపడుతున్నారా? అందుకే గేమ్ నుంచి తప్పించారా? అని ప్రశ్నించారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ను పక్కన పెడితే గేమ్‌లో అసలు కిక్కే ఉండదు అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. గేమ్‌లో గట్టి పోటీనిచ్చేవారితోనే ఆడాలి..నేను స్ట్రాంగ్ ప్లేయర్ అయినందుకే నన్ను హోస్ నుంచి బయటికి పంపారు.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 


 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)