Breaking News

ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ

Published on Sat, 11/29/2025 - 16:54

మీకు ఈ మధ్యే పెళ్లయిందా లేదంటే త్వరలో చేసుకోబోతున్నారా? అయితే ఈ సినిమా మీకోసమే. ఈ కాలంలో వైవాహిక బంధం నిలబడాలంటే ఏం కావాలి? అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? ప్రస్తుత జనరేషన్‌లో విడాకులు కేసులు ఎందుకు ఎక్కువయ్యాయి తదితర అంశాలతో తీసిన తమిళ కామెడీ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. గత నెలలో థియేటర్లలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడు హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: అక్రమ సంబంధంపై డార్క్ కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)

కథేంటి?
శివ (రియో రాజ్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెద్దలు నిశ్చయించడంతో శక్తి(మాళవిక మనోజ్)ని పెళ్లి చేసుకుంటాడు. నెల రోజులు బాగానే ఉంటారు. కానీ తర్వాతే అసలు సమస్యలు మొదలవుతాయి. ఏడాది తిరిగేసరికల్లా కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కోర్టుకి వెళ్తారు. పెళ్లయిన ఏడాదికే శివ-శక్తి.. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలేం జరిగింది? చివరకు వీళ్లిద్దరూ కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
పెళ్లి జీవితం గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో ఇదొకటి. ప్రస్తుత జనరేషన్‌లో వివాహం చేసుకున్న జంటల జీవితం ఎలా ఉంటోంది? వాళ్ల జీవితంలో ఏమేం జరుగుతోంది? లాంటి విషయాలని చాలా రియలస్టిక్‌గా, హాస్యభరితంగా చూపించిన మూవీ ఇది.

80, 90ల్లో అయినా ఇప్పటితరంలో అయినా పెళ్లి జీవితం నిలబడాలంటే ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటి చిన్న విషయాలే కావాలి. ఈ పాయింట్‌నే కాస్త కామెడీగా, కాస్త ఎమోషనల్‌గా ఇందులో చూపించారు. ఇప్పటి జనరేషన్.. పెళ్లికి గౌరవం ఇచ్చి, ఎలా కలిసిమెలిసి ఉండాలో క్లైమాక్స్‌లో కోర్టులో వచ్చే సీన్‌తో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.

వైవాహిక జీవితంలో ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు. అటు భర్త అయినా ఇటు భార్య అయినా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి. అప్పుడే బంధం బలంగా నిలబడుతుంది. ఈ విషయాన్ని చూపించిన విధానం.. ఊహించే విధంగా ఉన్నప్పటికీ చాలామందికి కనెక్ట్ అవుతుంది. అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూని హైలెట్ చేస్తూ అమ్మాయిలని విలన్‌గా చూపించినట్టు కొన్ని సీన్స్ అనిపిస్తాయి. కానీ ఇద్దరిలోనూ తప్పులున్నాయని చూపించడం సహజంగా అనిపిస్తుంది.

అసలైన ఫెమినిజంకి సూడో ఫెమినిజంకి తేడా కూడా కొట్టినట్లు చూపించారు. భార్య భర్తల మధ్య ఇగో (పంతం) అనేది ఎంత ప్రమాదమో? చుట్టుపక్కన ఉన్నోళ్లు.. ఈ గొడవల్లో ఎంతలా పెట్రోల్ పోస్తారనే సీన్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. సోషల్ మీడియాలో ఫెమినిజం మైండ్ సెట్‌తో హడావుడి చేసే అమ్మాయి.. ఒకవేళ మన ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంటి? పెళ్లికి ముందు చాలామంది కుర్రాళ్లు.. కాబోయే భార్యలకు చాలా ప్రామిస్‌లు చేసేస్తుంటారు కదా. వాటి వల్ల తర్వాత కాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కూడా కామెడీగా చూపించిన విధానం బాగుంది.

'ఫెమినిస్ట్ అంటే.. భర్త, పిల్లలతో సంతోషంగా ఉండకూడదా ఏంటి?' అని ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇది చాలామంది ఆడపిల్లలు, మహిళలని ఆలోచింపజేస్తుంది. 50-50 అని గొడవపడటం కాకుండా.. 70-30, 30-70 అని అర్థం చేసుకుంటూ తగ్గి నెగ్గి కలిసి జీవించాలి అనే చెప్పే క్లైమాక్స్ అయితే సూపర్ అనిపిస్తుంది.

అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా ఉంటే ఉన్నాయి. సినిమాలో స్టోరీ చాలావరకు ఊహించే విధంగా ఉంటుంది. కామెడీ బాగున్నా రెండు గంటల సినిమానే అయినా చాలాచోట్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తెలుగు డబ్బింగ్ బాగున్నా సరే పాటల్లో సాహిత్యం అస్సలు అతకలేదు. హీరోహీరోయిన్ రియో రాజ్, మాళవిక మాత్రం సహజంగా నటించారు. ఓవరాల్‌గా ఈ వీకెండ్ ఏదైనా మంచి కామెడీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి. టైమ్ పాస్ అయిపోతుంది.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా’ మూవీ రివ్యూ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)