Breaking News

ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్‌

Published on Mon, 07/07/2025 - 15:02

అందమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం '8 వసంతాలు'.. జూన్‌ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే, తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అనంతిక సానీల్‌కుమార్(Ananthika Sanilkumar) ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీస్‌ నిర్మించిన ఈ మూవీ  ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.

8 వసంతాలు చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. జులై 11న స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. రొమాంటిక్‌ డ్రామా మూవీకి చాలా మంది ఫ్యాన్స్‌ అయిపోయారు. '8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీకెండ్‌లో చూడతగిని చిత్రమేనని చెప్పొచ్చు.

కథ ఏంటి..?
శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)