Breaking News

ఇజ్రాయెల్‌పై ట్వీట్‌.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఎక్స్‌ ఖాతా సస్పెండ్‌

Published on Mon, 10/28/2024 - 20:13

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై  విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్‌లో క్షిపణి తయారీలో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ఇజ్రాయెల్‌ సైన్యం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. 

ఇజ్రాయెల్‌ దాడులతో టెహ్రాన్‌లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం.  ఈ దాడులతో టెహ్రాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలిసింది.

ఇక ఇజ్రాయెల్‌ దాడులపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వివాదాస్పద ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమం ద్వారా ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ పోస్టు పెట్టారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ఇరాన్‌ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన ట్వీట్‌ చేసిన ఖాతాను ‘ఎక్స్‌’ సస్పెండ్‌ చేసింది.

‘రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్టపాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం’ అని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాడటంతో ఆ ఖాతాను ఎక్స్‌ సస్పెండ్‌ చేసింది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)