Breaking News

భారత్‌పై సుంకాలు అందుకే.. కరోలిన్‌ లీవిట్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 08/20/2025 - 08:52

వాషింగ్టన్‌: భారత్‌పై సుంకాల విషయమై అమెరికా మరోసారి స్పందించింది. ఉక్రెయిన్‌, రష్యా యుద్దం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యూహంలో భాగంగానే భారత్‌పై సుంకాల విధించినట్టు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ చెప్పుకొచ్చారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు తెలిపారు.

వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్‌ నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్‌ చర్చల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై దాడులు నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్‌ దృష్టి సారించారు. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. అది ట్రంప్‌ పరిపాలన వ్యూహం. ఇందులో భాగంగా భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారని అన్నారు. ఇదే సమయంలో భారత్‌ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్‌- పాక్‌ల మధ్య యుద్ధాన్ని ట్రంప్‌ వాణిజ్యంతో ముగించారని పాత పాటే పాడారు.

మరోవైపు.. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్‌తో సహా యూరోపియన్‌ నాయకులతో జరిగిన చర్చలే తొలి అడుగు అని పేర్కొన్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి నెలకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)