..ఇక ఇరాన్‌ వంతు !!

Published on Thu, 01/08/2026 - 05:37

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశాంగ విధానాన్ని ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ  శాక్స్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ట్రంప్‌ అదుపు తప్పారు. ఆయనది మతిలేని దూకుడు’’ అంటూ విమర్శించారు. అమెరికా నిత్యం పాటిస్తానని గొప్పగా చెప్పుకునే నిబంధనలు నిజానికి కాకమ్మ కథలు మాత్రమేనంటూ దుయ్యబట్టారు. 

వెనెజువెలా అనంతరం ట్రంప్‌ తదుపరి లక్ష్యం కచ్చితంగా ఇరాన్‌ అని తాజాగా ఇండియాటుడే వార్తాసంస్థతో మాట్లాడుతూ  శాక్స్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇటీవలే ఫ్లోరిడాలోని మారా లాగో ఎస్టేట్‌లో ట్రంప్‌తో భేటీ అయ్యారు. తదుపరి లక్ష్యం ఇరాన్‌ అని ఆ సందర్భంగా వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు’’ అని వెల్లడించారు. అమెరికాను ధూర్త దేశం (రోగ్‌ స్టేట్‌)గా శాచ్స్‌ అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ అంతకుమించిన ధూర్త దేశమంటూ ఆక్షేపించారు. 

‘‘అవి రెండూ నిజంగా ఇరాన్‌పై భారీ ఎత్తున దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచ యుద్ధ స్థాయికి విస్తరిస్తుంది’’ అని హెచ్చరించారు. ఇరాన్‌ వద్ద పలు అత్యాధునిక క్షిపణులున్నాయని గుర్తు చేశారు. ‘‘ఇరాన్‌ మాత్రమే కాదు. మెక్సికో, కొలంబియా, క్యూబా, డెన్మార్క్, నైజీరియా ఇలా కనీసం మరో అర డజను దేశాలను ట్రంప్‌ బెదిరిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాద పోకడలను భారత్‌ తదితర బ్రిక్స్‌ దేశాలే అడ్డుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. గ్రీన్‌లాండ్‌ ఎప్పటికీ డెన్మార్క్‌దేనని యూరప్‌ దేశాలన్నీ ముక్తకంఠంతో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

పిల్ల చేష్టల ట్రంప్‌
సైన్యం, ముఖ్యంగా సీఐఏ, పెంటగాన్‌ వంటి భద్రతా సంస్థలు, ఇంకా సామ్రాజ్యవాద కుబేరులతో కూడిన రాజ్యాంగేతర శక్తి అయిన డీప్‌స్టేట్‌ ప్రస్తుతం అమెరికాను పాలిస్తోందంటూ  శాక్స్‌ ఆరోపించారు. ‘‘ఇక ట్రంప్‌ నిజానికి ఓ ఉన్మాది. ఎక్కడ చమురు కనిపించినా అది తమదేననే రకం. ఆయనవి పిల్ల చేష్టలు. వెనెజువెలాపై ఆయనకు ఎప్పట్నుంచో కన్నుంది. తొలి దఫా అధ్యక్షునిగా ఉండగా 2017లో లాటిన్‌ అమెరికాకు చెందిన పలువురు నేతలను విందుకు పిలిచారు. వెనెజువెలాపై తానెందుకు దాడి చేయకూడదని వారిని అడిగారు. అది ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందంటూ వారు వారించడంతో వెనక్కు తగ్గారు.

 ఇప్పుడు మాత్రం మతిలేని దూకుడుతో మదురోను బంధించి తీసుకెళ్లారు. అయితే దీని వెనక డీప్‌స్టేట్‌ అజెండా సైతం దాగుంది. ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానాన్ని నియంత్రించేంది అధ్యక్షుడు కాదు, డీప్‌స్టేట్‌’’ అని  శాక్స్‌ చెప్పుకొచ్చారు. ‘‘నిజానికి ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా 20 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే వస్తోంది. కానీ పలు దేశాల్లో నాయకత్వాన్ని మార్చేందుకు ఇప్పటిదాకా అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. వెనెజువెలాలో అదే పునరావృతం అయ్యేలా కన్పిస్తోంది’’ అని అంచనా వేశారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)