Breaking News

ఇరాన్‌ వార్‌ : ట్రంప్‌ సరికొత్త వార్నింగ్‌

Published on Fri, 03/13/2026 - 13:06

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ మొదలు పెట్టిన దాడులు, 14వ రోజుకు చేరుకున్నాయి. ఇరాన్‌ చేస్తున్న ప్రతి దాడులు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై స్పందిస్తూ, పరిస్థితి "చాలా వేగంగా మారుతోంది" అని,  అతి త్వరలో ఇరాన్‌మాకు లొంగిపోనుందంటూ వ్యాఖ్యానించారు.  ట్రంప్ కొత్త బెదిరింపు తర్వాత ఇరాన్, లెబనాన్‌లో కొత్త దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

యుద్ధంలో తన పక్షం గెలిచిందని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్, హార్ముజ్ జలసంధి మూసివేతతో ఉత్పన్నమైన సరఫరా సమస్యల కారణంగా చమురు ధరలు పెరగడం ద్వారా అమెరికా గణనీయమైన డబ్బు సంపాదించే అవకాశం ఉందని గురువారం అన్నారు. ఇరాన్ ఇంధన బెదిరింపులు చేస్తున్నప్పటికీ, అణ్వాయుధాలను పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 

"అమెరికా ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు, కాబట్టి చమురు ధరలు పెరిగినప్పుడు, మేము చాలా డబ్బు సంపాదిస్తాము." ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండకుండా అడ్డుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొనడం చర్చకు దారి తీసింది. 

ఇరాక్‌లో విమాన ప్రమాదం: అమెరికా విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే శత్రుదాడిలో కాకుండా ఇరాక్‌లో అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ (ఇంధనం నింపే) విమానం ప్రమాదానికి గురైంది. మరో విమానంతో జరిగిన ఢీకొనడం వల్ల జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాక్‌లోని కుర్దిస్తాన్ రీజియన్‌లో జరిగిన దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దీనిని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా ఖండించారు.

UAE పై ఇరాన్ దాడులు
మార్చి 12న ఇరాన్ నుండి ప్రయోగించిన 10 బాలిస్టిక్ క్షిపణులు మరియు 26 డ్రోన్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విజయవంతంగా అడ్డుకుంది.దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు UAE మొత్తం 278 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు మరియు 1,540 డ్రోన్లను గాలిలోనే ధ్వంసం చేసింది. దుబాయ్ మధ్య భాగంలో క్షిపణి శకలాలు పడటంతో ఒక భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇది ఇలా ఉంటే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో స్వదేశాలకు వెళ్లాల్సిన ప్రవాసులకు యూఏఈ  భారీ ఊరట కల్పించింది. ఫిబ్రవరి 28 లేదా ఆ తర్వాత వీసా గడువు ముగిసిన వారు, కొత్త ఎంట్రీ పర్మిట్ అవసరం లేకుండానే మార్చి 31 వరకు  ఉండేందుకు అనుమతినిచ్చింది. 

మరోవైపు యుద్ధ పరిణామాలపై తొలిసారి స్పందించిన ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ పోరాడుతూనే ఉంటామన , హోర్ముజ్ జలసంధిని మూసివేస్తానని  గురువారం నాటి ఒక టెలివిజన్ ప్రెజెంటర్ చదివిన సందేశంలో స్పష్టం చేశారు. రక్తం ధారబోసిన తమ అమరవీరుల కోసం  ప్రతీకారం తీర్చు కుంటామని ప్రకటించాడు.

కాగా పశ్చిమాసియా యుద్ధం రెండవ వారంలోకి అడుగుపెడుతుండగా ఇరు పక్షాలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తుండటం గమనార్హం. ఈ అనూహ్య యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 2వేలకు పైగా పెరిగింది. వీరిలో ఎక్కువమంది ఇరాన్‌లోనే ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. ఇరు పక్షాల భీకర దాడుల మధ్య కొనసాగుతున్న యుద్ధం లక్షలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)