Breaking News

ప్లీజ్‌ మమ్మీ ఆపండి.. అమెరికా స్కూల్‌లో వింత ప్రవర్తన..

Published on Sat, 05/31/2025 - 07:15

వాషింగ్టన్‌: అమెరికాలోకి ఎలిమెంటరీ పాఠశాలలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. చిన్నారుల గ్రాడ్యుయేషన్‌ డే సందర్భంగా అక్కడికి వచ్చిన పేరెంట్స్‌ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఇది కాస్తా కొట్లాటకు దారి తీసింది. పేరెంట్స్‌ ఫైటింగ్‌ కారణంగా చిన్నారులు భయంతో ఏడుస్తూ.. వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. అమెరికాలో ఆర్కాన్సాస్‌ రాష్ట్రంలోని వెస్ట్‌ మెంఫిస్ నగరంలో ఉన్న ఫాల్కీ ఎలిమెంటరీ స్కూల్‌లో.. ఈనెల 28వ తేదీన గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సదరు స్కూల్‌ యాజమాన్యం చిన్నారులు సహా వారి తల్లిదండ్రులకు ఆహ్వానం కల్పించారు. ఈ క్రమంలో పిల్లలతో పాటుగా వారి పేరెంట్స్‌ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం, కార్యక్రమం జరుగుతుండగా.. కొందరు మహిళల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం మొదలైంది.

దీంతో, మాటాలమాటా పెరిగి.. గొడవ పెద్దదిగా మారింది. ఆగ్రహంతో రగిలిపోయిన పేరెంట్స్‌.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పురుషులు కూడా కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈవెంట్‌లో పేరెంట్స్‌ గొడవపడటంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. కన్నీరుపెట్టుకుంటూ వారిని ఆపివేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు.

మరోవైపు.. ఈ ఘటనను సదరు పాఠశాల యాజమాన్యం ఖండించింది. ఇటువంటి ప్రవర్తన కరెక్ట్‌ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. విద్యార్థులు, సిబ్బంది రక్షణ, పాఠశాల ప్రాంగణం భద్రత మొదటి ప్రాధాన్యం అని.. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది. వీరికి గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)