Breaking News

ఇరాన్‌ ఉలిక్కిపడేలా.. ట్రంప్‌, నెతన్యాహు మెగా ఆపరేషన్!

Published on Sat, 08/01/2026 - 08:05

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్‌ భారీ స్థాయి వైమానిక దాడులకు సిద్ధమవుతున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్‌ ఇంధన మౌలిక వసతులపై ఇప్పటివరకు జరగని స్థాయిలో దాడుల ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్‌ న్యూస్‌ వెల్లడించింది.

ఈ దాడుల్లో ఇరాన్‌లోని కీలక విద్యుత్‌ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను ఎంచుకున్నట్లు సమాచారం. ఇరాన్‌ సైనిక కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యవస్థను కొనసాగించే సామర్థ్యాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ ఉండొచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ ఆపరేషన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని సమాచారం. పెంటగాన్‌ కూడా లక్ష్యాలపై స్పందించేందుకు నిరాకరించింది.

ప్రపంచ మార్కెట్లు సోమవారం ప్రారంభమయ్యేలోపు ఈ ఆపరేషన్‌ను ముగించాలని అమెరికా వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ ఇంధన సరఫరాలపై దాడులు జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ అంశంపై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను కూడా ఈ ప్రణాళికల్లో భాగస్వామిగా ఉంచినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్‌తో టెల్‌ అవీవ్‌ సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌పై పూర్తి స్థాయి సైనిక చర్యకు తిరిగి వెళ్లే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఓ ఇజ్రాయెల్‌ అధికారి స్పష్టం చేశారు.

ట్రంప్‌ అధ్యక్షతన క్యాంప్‌ డేవిడ్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఇరాన్‌పై సైనిక ఎంపికలపై చర్చ జరిగినట్లు సమాచారం. కొందరు అధికారులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ట్రంప్‌ మాత్రం ఇరాన్‌పై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ చాలా తీవ్రంగా దెబ్బతీస్తాం అనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా లక్ష్యం ఇరాన్‌ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవడమేనని వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. అధ్యక్షుడి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా అమలు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని పెంటగాన్‌ పేర్కొంది. టెహ్రాన్‌ నగర విద్యుత్‌ సరఫరాను దెబ్బతీయడం వంటి ప్రత్యామ్నాయాలపైనా అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం.

మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ చర్యలపై ఇరాన్‌ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎలాంటి అమెరికా దాడి జరిగినా ప్రతీకార చర్యలకు సమగ్ర ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్‌ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని కీలక మౌలిక వసతులు, ప్రాంతీయంగా ఉన్న అమెరికా ఇంధన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)