Breaking News

మేము కోరుకున్నది దక్కకపోతే.. 

Published on Mon, 06/01/2026 - 04:58

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో హార్మూజ్‌ జలసంధి దిగ్బంధం సహా యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో మంచి ఒప్పందానికి అమెరికా, ఇరాన్‌లు చాలా దగ్గరగా వచ్చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అయితే, తాము కోరుకున్నది లభించకపోతే ఆ ఒప్పందాన్ని వేరే విధంగా ముగిస్తామని ట్రంప్‌ తెలిపారు. ఫాక్స్‌ న్యూస్‌లో తన కోడలు లారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పలు అంశాలపై మాట్లాడారు. 

ఇరాన్‌తో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చేశామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కానీ, తొందరపడితే మంచి ఒప్పందం కుదరదని అభిప్రాయపడ్డారు. నెమ్మదిగా అయినా సరే కచ్చితంగా తాము కోరుకున్నది సాధిస్తున్నామని తేల్చిచెప్పారు. కోరుకున్నది దక్కేదాకా వేచి చూస్తామని, ఒప్పందం విషయంలో తొందరేమీ లేదని సంకేతాలిచ్చారు. చర్చల విషయంలో ఇరానీయులు మంచి నిపుణులు అని అన్నారు. 

కానీ, ఇరాన్‌ సైనికపరంగా ఇప్పటికే ఓడిపోయినందున ప్రస్తుతం అన్ని అవకాశాలు అమెరికా చేతిలోనే ఉన్నాయని స్పష్టంచేశారు. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోగలిగితే మంచిదేనని.. లేకపోతే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడం లేదని ఇరాన్‌ చెప్పిందని ట్రంప్‌ అన్నారు. ఒకవేళ వారు(ఇరాన్‌) అణ్వాయుధాన్ని కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అలాంటి అయుధాన్ని కొనుగోలు చేయబోమని ఇరాన్‌ హామీ ఇచ్చిందన్నారు. 

ఇరాన్‌ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్‌ వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికాకు గణనీయమైన పట్టు సాధించిందని తెలిపారు. అయితే, ఇరాన్‌ నాయకత్వంలో కొందరు మితవాదులు ఉండడంతో తాము ఇరాన్‌ సైన్యాన్ని పూర్తిగా నిరీ్వర్యం చేయలేదని అన్నారు. ఇరాన్‌లోని అత్యంత తీవ్రవాద శక్తులను, కీలక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నామని పునరుద్ఘాటించారు. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన 60 రోజల తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేయడానికి ట్రంప్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. అందులోని అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.      
 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)