Breaking News

ట్రంప్‌ నిర్ణయంతో మిడిల్‌ ఈస్ట్‌లో కొత్త టెన్షన్‌

Published on Wed, 07/22/2026 - 07:32

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాతో న్యూక్లియర్‌ డీల్‌కు ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ తన భూభాగంలోనే యురేనియం శుద్ధి (ఎన్‌రిచ్‌మెంట్‌) చేపట్టే అవకాశం లభించనుంది. అయితే గతంలో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందాలతో పోలిస్తే.. సౌదీ డీల్‌లో కీలక భద్రతా నిబంధనలు లేకపోవడంపై అంతర్జాతీయంగా కలకలం రేగింది.

ట్రంప్‌ ప్రభుత్వం ఆమోదించిన ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. దీని విలువ పదుల బిలియన్ల డాలర్లుగా ఉండనుంది. ఈ ఒప్పందం అమలైతే సౌదీ అరేబియాలో పౌర అణు విద్యుత్‌ కార్యక్రమాల నిర్మాణంలో అమెరికా కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇతర దేశాల కంపెనీలకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు.

సంప్రదాయ భద్రతా నిబంధనలు లేవా?
అమెరికా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాల్లో.. అణు సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ సౌదీతో కుదుర్చుకున్న తాజా ఒప్పందంలో అలాంటి కొన్ని కీలక రక్షణ చర్యలు లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌ అనుమతి ఇవ్వడం భవిష్యత్‌ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

వైట్‌హౌస్‌లో కీలక భేటీ తర్వాత నిర్ణయం
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం అణు ఒప్పందంపై ముందడుగు పడింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్యాకేజీని త్వరలోనే అమెరికా కాంగ్రెస్‌ పరిశీలనకు పంపనున్నట్లు సమాచారం.

‘123 అగ్రిమెంట్‌’లో భాగంగా..
అమెరికా విదేశీ దేశాలతో అణు సహకారం కోసం రూపొందించే ప్రత్యేక ఒప్పందాన్ని సాధారణంగా ‘123 Agreement’ అని పిలుస్తారు. తాజా ఒప్పందంలో భాగంగా అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌ రైట్‌, సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్‌ అబ్దుల్‌అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ సంతకాలు చేసినట్లు సమాచారం.

మిడిల్‌ ఈస్ట్‌లో కొత్త అణు సమీకరణాలు?
చమురు సంపదతో ప్రపంచంలో కీలక శక్తిగా ఉన్న సౌదీ.. ఇప్పుడు అణు ఇంధన రంగంలో అడుగులు వేయడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా-సౌదీ అణు ఒప్పందం మిడిల్‌ ఈస్ట్‌ వ్యూహాత్మక సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్‌ అణు కార్యక్రమం నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)