Breaking News

మొజ్తాబా నా మాట విను : డొనాల్డ్‌ ట్రంప్‌

Published on Thu, 03/12/2026 - 08:07

వాషింగ్టన్‌: ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మోజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇరాన్‌ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాలి. ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తే, కొత్త సుప్రీం లీడర్‌ మోజ్తబా ఖమేనీయే లక్ష్యంగా చేసే దాడులకు తాను మద్దతు ఇస్తానని ట్రంప్‌ స్పష్టంగా పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.

37 ఏళ్ల పాటు ఇరాన్‌ను ఒంటిచేత్తో పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ జీవితం విషాదాంతమైంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుండగా, ఇజ్రాయెల్‌ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి దాడి చేసింది. ఆ దాడిలో అయతుల్లా ఖమేనీ మరణించారు. ఇజ్రాయెల్‌ ఎలా మిలటరీ ఆపరేషన్‌ చేపట్టిందో, అదే తరహా చర్యలు మోజ్తబా ఖమేనీపై కూడా జరగవచ్చని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.

అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడంపై ట్రంప్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారని నేను నమ్మను’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.  మోజ్తబా నియామకానికి ముందు, అమెరికా ఇరాన్‌ తదుపరి నాయకుడి ఎంపికలో కూడా తమకు పాత్ర ఉండాలని పట్టుబట్టింది. వెనిజువెలా పాలనా పరమైన అంశాల్లో అమెరికా జోక్యం చేసుకున్నట్లే, ఇరాన్‌లో కూడా అదే విధంగా ప్రభావం చూపాలని ట్రంప్‌ కోరుకున్నారు.

అయితే, దివంగత అయతుల్లా ఖమేనీ తన వీలునామాలో మోజ్తబా తన వారసుడిగా రావాలని కోరుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడితో మోజ్తబా ఎంపిక లాంఛనమైంది. ఇదే అంశంపై ఇరాన్‌ ప్రతిపక్ష గ్రూప్‌ ‘నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ రీసెర్చ్’ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ మాట్లాడుతూ..‘ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా కోరుకోలేదు. ఆయన వీలునామాలో మోజ్తబాను వారసుడిగా పేర్కొనవద్దని స్పష్టంగా రాశారు’ అని తెలిపారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు