ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్‌ నుంచి కాల్‌ వచ్చింది!

Published on Sat, 03/14/2026 - 16:30

ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధంలో ఉన్నాయి. ఇరాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకునే వరకూ యుద్ధం ఆపేది లేదంటోంది అమెరికా. అదే సమయంలో ఇరాన్‌ కూడా తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఈ యుద్ధం ఎంతవరకూ వెళుతుందో అనే భయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. 

ఇప్పటికే ఇరాన్‌ గగనతలం తమ గుప్పిట్లోకి వచ్చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ చెబుతున్నా.. పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. ఇరాన్‌ సైతం అంతే ధీటుగా బదులిస్తూ ఉండటంతో అటు గల్ఫ్‌ దేశాలతో పాటు అమెరికాలో కూడా ఆందోళన చాయలు కనిపిస్తూనే ఉన్నాయి.   ట్రంప్‌ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇంకా ఇరాన్‌ లొంగిపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంచితే, ఒక లైవ్‌ షోలో ఉండగా అమెరికా ఆర్థికశాఖ కార్యదర్శి స్కాట్‌ బీసెంట్‌కు ఉన్నపళంగా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి కాల్‌ రావడం చర్చనీయాంశమైంది.  బీసెంట్‌  స్కై న్యూస్‌ స్టూడియోలో లైవ్‌ ప్రోగ్రామ్‌లో ఉండగా పిలుపు వచ్చింది.  ఆ స్టూడియోకు ట్రంప్‌ నుంచి కాల్‌ రావడంతో  ఉన్నపళంగా బీసెంట్‌ మధ్యలోనే వెళ్లిపోయారు.

ఆ కాల్‌ సారాంశం ఏంటంటే.. ‘ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్‌ నుంచి కాల్‌ వచ్చింది.. మిమ్మల్ని ట్రంప్‌ వెంటనే కలవాలట. వైట్‌హౌస్‌ సిట్యువేషన్‌ రూమ్‌కి రమ్మన్నారు’ అని లైవ్‌ ప్రోగ్రామ్‌ మధ్యలో సందేశం వెళ్లింది. దాంతో బీసెంట్‌ తన ఇంటర్వ్యూను  అక్కడే వదిలేసి పరుగు పరుగున వెళ్లి ట్రంప్‌ను కలిశారు. 

అయితే   ఆ తర్వాత బీసెంట్‌ తన లైవ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు బీసెంట్‌ ప్రోగ్రామ్‌ వాయిదా పడిన తర్వాత కొనసాగించారు. దీనిలో భాగంగా బీసెంట్‌ మాట్లాడుతూ..  ‘అధ్యక్షుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇరాన్ మిషన్ షెడ్యూల్‌కి ముందుగానే విజయవంతంగా కొనసాగుతోంది.  అలాగే  ప్రభుత్వ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని ట్రంప్‌ను కొనియాడారు.

 

ఇదీ చదవండి: 

ఏకంగా 10 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన కిమ్‌

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)