Breaking News

ట్రంప్‌ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి

Published on Sat, 03/14/2026 - 07:16

వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇరాన్ ఆర్థిక  రాజధానిగా భావించే ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

సైనిక స్థావరాలు ధ్వంసం
‘పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ బాంబు దాడులను మా సైన్యం చేపట్టింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్‌లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశాం’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఒక వ్యూహాత్మక నిర్ణయంతో అక్కడి చమురు మౌలిక సదుపాయాలను ప్రస్తుతానికి ధ్వంసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఈ దీవి నుంచే సరఫరా అవుతుంది. రోజుకు సుమారు 70 లక్షల బారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలుతుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 

హోర్ముజ్ జలసంధిపై హెచ్చరిక
వ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ‘ఒకవేళ హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే, చమురు క్షేత్రాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని ఆయన హెచ్చరించారు. యుద్ధ ట్యాంకర్లకు రక్షణగా త్వరలోనే అమెరికా నౌకాదళం కాపలాగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.

‘ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తాం’
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను, మూడు అత్యాధునిక యుద్ధ నౌకలను యుద్దప్రాంతానికి పంపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ పేర్కొన్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ  ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. 

ఇది కూడా చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)