Breaking News

దిగిరాకపోతే 155 శాతం సుంకాలు: ట్రంప్‌

Published on Tue, 10/21/2025 - 06:46

ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ యుద్ధం కొనసాగుతోంది. రష్యా చమురును కొనడం ఆపకపోతే భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుందని ఇండియాకు ఆయన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా చైనాపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉందని.. అందుకే ఎక్కువ టారిఫ్‌లు చెల్లిస్తోందని వెటకారంగా మాట్లాడారాయన. ఈ క్రమంలో.. భారీ సుంకాల మోత తప్పదంటూ హెచ్చరికల జారీ చేశారు. 

తాజాగా అమెరికా ఆస్ట్రేలియాతో 8.5 బిలియన్ డాలర్ల ‘అరుదైన ఖనిజాల’ ఒప్పందం(Rare Minerals Agreement)  చేసుకుంది. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ వైట్‌హౌజ్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా  ఇద్దరూ మీడియాతో మాట్లాడుతున్న టైంలో.. ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. చైనా-అమెరికా ఈ ఇరు దేశాలు అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని, అలా జరగని పక్షంలో చైనా 155 శాతం సుంకాలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. 

చైనా‌తో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరనుందని భావిస్తున్నా. ఈ ఒప్పందం రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా మంచిదై ఉంటుంది. చైనా అమెరికా పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తోందని.. ప్రస్తుతం 55% టారిఫ్‌ల రూపంలో భారీగా డబ్బు చెల్లిస్తోందని పేర్కొన్నారు. నవంబర్ 1న ఒప్పందం కుదరకపోతే టారిఫ్‌లు 155%కి పెరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు(Trump Warn China).

అక్టోబర్‌ 31వ తేదీ నుంచి  దక్షిణ కొరియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సమావేశం జరగనుంది. అయితే.. దీనికంటే ముందే అక్టోబర్‌ 29, 30 తేదీలలో  ట్రంప్‌ అక్కడ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. తనకు చైనా అధ్యక్షుడికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనన ట్రంప్‌.. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చైనా ప్రపంచంలో అరుదైన ఖనిజాల (Rare Earth Materials) ప్రధాన సరఫరాదారు. వీటి సాయంతోనే స్మార్ట్‌ఫోన్లు, యుద్ధ విమానాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాల తయారు అవుతుంటాయి. అయితే.. చైనా ఈ ఎగుమతులపై నియంత్రణలు పెంచింది. దీంతో అమెరికా సహా ఇతర దేశాలకు ఈ ఖనిజాలు అందుబాటులో ఉండటం కష్టతరమయ్యే చాన్స్‌ ఉంది. అందుకే ట్రంప్‌ చైనా‌తో మంచి వాణిజ్య ఒప్పందం కుదిరితే, ఇలాంటి సమస్యలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి: అమెరికాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన నెతన్యాహు!

Donald Trump: ఒప్పందం చేసుకోకపోతే.. ట్రంప్ వార్నింగ్

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)