Breaking News

ఆపరేషన్ సిందూర్.. మరోసారి గెలికిన ట్రంప్

Published on Tue, 12/30/2025 - 20:24

నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరాటం అంతా ఇంతా కాదు అందుకోసం ఏదైనా దేశాల మధ్య పంచాయితీ ఉంటే హడావుడిగా వెళ్లి అందులో వేలు పెట్టడం తర్వాత వారి మధ్య పంచాయితీ తానే తెగ్గొట్టానని క్రెడిట్ కొట్టేయడం ట్రంప్‌కు చాలా కామన్‌గా మారింది. ఇప్పటి వరకూ తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని అయినా తనను ఎవరూ గుర్తించరని తనకు శాంతి బహుమతి ఇవ్వరని ఆ మధ్య కస్సుబుస్సులాడారు.

ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సిందూర్ వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఇండియా-పాక్‌ల మధ్య తానే ఆపానని వార్ ఆపకుంటే అధిక పన్నులు విధిస్తానని హెచ్చరించడంతో ఇరు దేశాలు శాంతించాయని తెలిపారు. ఇలా యుద్ధం ఆపాననే ప్రకటనను ట్రంప్ ఇదివరకూ దాదాపు 70 సార్లు పలికాడంటే ఈ విషయంలో ఆయన భారత్‌ను ఎంతగా రెచ్చగొట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరోసారి ఆపరేషన్ సిందూర్ అంశం తెరమీదకొచ్చింది.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రస్థావన తెరమీదకు తెచ్చారు.  "ఇదివరకూ నేను ఎనిమిది యుద్ధాలను నియంత్రించాను. ఇండియా, పాకిస్థాన్ విషయంలోనూ అంతే కానీ ఆ క్రెడిట్ నాకు ఇవ్వరూ. . నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. తాను గత పదేళ్లుగా ప్రయత్నిస్తూన్నా ఇది చేయలేకపోయానన్నారు. నేను మాత్రం ఒక్కరోజులో ఈ యుద్ధాలను ఆపా" అని ట్రంప్ బింకాలు పలికారు.

ట్రంప్ మధ్యవర్తిత్వం అంశంపై భారత్ సైతం ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ అంశంలో ఏవరూ మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు ప్రకటించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో ఈ అంశంపై ప్రకటన చేశారు. ఏ ప్రపంచ నాయకుడు ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని భారత్‌ను అడగలేదని ఈ నిర్ణయం భారత్ స్వతంత్ర్యంగా తీసుకుందని స్పష్టం చేశారు. 

పహల్గామ్ అటాక్‌కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను వారి దేశంలోనే ధ్వంసం చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)